
Malida Laddu: సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం.. మలీద లడ్డూలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో అత్యంత ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఈ పండుగను ముఖ్యంగా ఆడపడుచులు జరుపుకుంటారు. వారు అందమైన చీరల్లో, పూలతో అలంకరించిన బతుకమ్మను కట్టుకుని, మహిళలు ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. పూలతో సాగే ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంలోని వీధులు, వాడలు, గ్రామాలను రంగురంగుల పువ్వులతో అందంగా మార్చేస్తుంది. ఈ వేడుకలో మహిళలు తమ కుటుంబానికి, ప్రకృతికి మేలు కోరుతూ బతుకమ్మను నైవేద్యాలు సమర్పిస్తారు. సద్దుల బతుకమ్మ: తొమ్మిది రోజులు పాటు జరిపే ఈ పండుగలో చివరి రోజు "సద్దుల బతుకమ్మ" ప్రధానమైనది. ఈ రోజున ప్రత్యేకంగా "మలీదా లడ్డూ" నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది తయారు చేయడం చాలా సులువు.
రెసిపీ
మలీదా లడ్డూ రెసిపీ తయారీ విధానం
కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ - అరకప్పు, గోధుమపిండి - ఒక కప్పు, జీడిపప్పు, బాదం, పిస్తా - కలిపి గుప్పెడు, పాలు - అరకప్పు, యాలకుల పొడి - ఒక స్పూను, సోంపు పొడి - అర స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, బెల్లం తురుము - ఒక కప్పు. తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమపిండిని,రవ్వను వేసి కలపాలి. అందులో కాచిన నెయ్యి వేసి బాగా కలిపి,పాలు వేసి చపాతీ పిండిలా చేయాలి. పావుగంట సేపు పక్కన పెట్టి,ఆ పిండిని చపాతీల్లా ఒత్తి కాల్చుకోవాలి.ఇప్పుడు చపాతీలను చిన్న ముక్కలుగా చేసి,మిక్సీలో రుబ్బాలి.గిన్నెలో ఈ పొడిని,బెల్లం తురుమును కలపాలి.కాచిన నెయ్యిలో జీడిపప్పు,బాదం,పిస్తాలను వేయించి,యాలకుల పొడితో కలపాలి.ఈ మిశ్రమంతో లడ్డూలు చేయాలి.