
గోళ్ళు కొరికే అలవాటు మానలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
చిన్నప్పుడు మొదలైన గోళ్ళు కొరికే అలవాటు పెద్దయ్యాక కూడా కొనసాగుతూనే ఉంటుంది. గోళ్ళు కొరకడం వల్ల పంటి చిగుళ్ళు దెబ్బతింటాయి. కొన్ని కొన్ని సార్లు పంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు గోరు దగ్గర చర్మం దెబ్బతింటుంది.
ఇవన్నీ తెలిసినా కూడా గోళ్ళు కొరకడం మానేయలేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి.
గోళ్ళను పెరగనివ్వకండి: గోళ్ళు పొట్టిగా ఉంచుకుంటే కొరకడానికి వీలుండదు. అందుకే వీలున్నప్పుడల్లా గోళ్ళను కత్తిరిస్తూనే ఉండండి. ఎల్లప్పుడూ మీతోపాటు గోర్ల కత్తెర ఉంచుకోండి.
మ్యానిక్యూర్ చేయించుకోండి: దీని కారణంగా గోళ్ళు అందంగా తయారవుతాయి. ఒకవేళ మీరు కొరికితే ఆ అందం పోతుంది. కనీసం ఆ ఆలోచనతో మీరు గోళ్లు కొరకడం తగ్గిస్తారు. అందుకే రెగ్యులర్ గా మ్యానిక్యూర్ చేయించుకోవడం అలవాటు చేసుకోండి.
ఆరోగ్యం
గోళ్ళు కొరకడం మానడానికి చేయాల్సిన పనులు
గోళ్ళ మందు రాసుకోండి: గోళ్ళను రుచిని మార్చేసే మందులు గోర్లకి మర్దన చేసుకోండి. దానివల్ల మీరు గోర్లను నోట్లోకి తీసుకున్నప్పుడు అదోలా అనిపించి మానేసే అవకాశం ఉంటుంది. ఆ మందుల్లో హానికారక రసాయనాలు ఉండకూడదని గుర్తుంచుకోండి.
వెగటు పుట్టే నెయిల్ పాలిష్: సాధారణంగా గోర్లు అందంగా కనిపించడానికి నెయిల్ పాలిష్ వేస్తారు. కానీ మీరు వెగటు పుట్టే నెయిల్ పాలిష్ వేయండి. అలాంటప్పుడు మీకు కొరకాలన్న ఆలోచన రాదు.
గోర్లను కప్పివేయండి: ఎన్ని చేసినా గోర్లు కొరికే అలవాటును మీరు మానకపోతే, గోర్లను కప్పివేయండి. గ్లౌవ్స్, బ్యాండేజెస్ తో గోర్లను కవర్ చేస్తే కొరకాలన్న ఆలోచన రాకుండా ఉంటుంది. దానివల్ల మీరు లాభాలు పొందుతారు.