
Dasara Naivedhyam: అమ్మవారి కటాక్షం పొందేందుకు.. ఈ నైవేద్యాలు తప్పనిసరి..
ఈ వార్తాకథనం ఏంటి
దేవీ భాగవతంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకన్నా అమ్మవారికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఉద్భవానికి మూల కారణం శక్తి స్వరూపిణి అమ్మవారే అని పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయ.. ఈ మూడు ప్రక్రియలకు ఆధారమైన శక్తి ఆమెలో ఉందని విశ్వసిస్తారు. ప్రాణికోటిని, మానవాళిని హింస పెడుతున్న మహిషాసురుడిని సంహరించడం కోసం జగన్మాత అనేక అవతారాల్లో యుద్ధం చేసింది. అనంతరం, ఆశ్వయుజ శుద్ద నవమి రోజే మహిషాసురాన్ని సంహరించింది. ఈ మహిషాసుర సమహారం తరువాత ప్రజలు ఈ వేడుకను ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో నవరాత్రులు జరుపుకోవడం మొదలుపెట్టారు.
వివరాలు
వేద సంబంధమైన సాంప్రదాయంలో దేవిత్రిమూర్తుల శక్తిగా చెప్పారు
ఈ పండుగ రోజులలో భక్తులు అమ్మవారిని ప్రతిరోజు ప్రత్యేక రూపంలో అలంకరించి పూజిస్తారు. అలంకరణతోపాటు ఆమెకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలను సమర్పించడం ద్వారా భక్తులు ఆమె కృపను పొందాలని ఆశిస్తారు. మహిషాసురం పై అమ్మవారి విజయం కేవలం భౌతిక విజయమే కాక, అన్ని ప్రయత్నాల్లో, ధార్మిక, ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించాలన్న కోరికకి ప్రేరణగా ఉంటుంది. వేద సంబంధమైన సాంప్రదాయంలో దేవిని త్రిమూర్తుల శక్తిగా చెప్పడం జరిగింది. మహాలక్ష్మి ఐశ్వర్యానికి, మహాసరస్వతి విజ్ఞానానికి, మహాకాలి శత్రు నాశనానికి ప్రతీక. ఈ త్రిమూర్తుల స్వరూపిణిని భక్తులు ప్రత్యేక పూజా విధానాలతో ఆరాధిస్తారు. నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని వేర్వేరు రూపాలలో అలంకరించి, ఆమెకు తగిన నైవేద్యాలను సమర్పించడం ఈ పండుగ ముఖ్యాంశం.
వివరాలు
నవరాత్రుల అలంకరణ, నైవేద్యం విధానం:
మొదటి రోజు - అమ్మవారిని దుర్గాదేవి రూపంలో అలంకరించి, ప్రధాన నైవేద్యంగా కట్టె పొంగలిని సమర్పిస్తారు. శ్రీశైల సాంప్రదాయం ప్రకారం, సాంబారు అన్నం, మినుప వడలు, రవ్వ కేసరి, పానకం వంటి నైవేద్యాలు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. రెండవ రోజు - అమ్మవారి బాల త్రిపురసుందరి (బ్రహ్మచారిణి) రూపంలో దర్శనం. ఈ రోజున పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు. మూడవ రోజు - చంద్రఘంట (గాయత్రీ దేవి) రూపంలో పూజ. నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసం సమర్పణ. నాలుగవ రోజు - అన్నపూర్ణాదేవి రూపం. భక్తులు మినుప గారెలు, మొక్కజొన్న వడలు సమర్పణ చేస్తారు.
వివరాలు
నవరాత్రుల అలంకరణ, నైవేద్యం విధానం:
అయిదవ రోజు - లలితాదేవి అలంకరణ. నైవేద్యంగా దద్దోజ నానం సమర్పణ. ఆరవ రోజు - మహాలక్ష్మి రూపంలో పూజ. నైవేద్యంగా రవ్వ కేసరి సమర్పణ. ఏడవ రోజు - సరస్వతి రూపంలో దర్శనం. నైవేద్యంగా పాయసం, అల్లం వడలు సమర్పణ. ఎనిమిదవ రోజు - దుర్గాదేవి అలంకరణ. నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పణ. పదో రోజు - ఆదిశక్తి శ్రీరాజరాజేశ్వరి రూపం. నైవేద్యంగా పాయసం, కొబ్బరన్నం సమర్పణ.
వివరాలు
మహిషాసురాన్ని సంహరించి లోకాన్ని రక్షించిన అమ్మవారు
ఈ విధంగా భక్తులు తొమ్మిది రోజుల యుద్ధంలో మహిషాసురాన్ని సంహరించి లోకాన్ని రక్షించిన అమ్మవారిని ఘనంగా ఆరాధిస్తారు. ఆది శంకరాచార్యులు స్థాపించిన ఈ పద్ధతిలో అమ్మవారిని ప్రతిరోజూ వేర్వేరు రూపంలో అలంకరించడం, ఆమెకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలను సమర్పించడం ద్వారా భక్తులు విజయాలు, శాంతి, ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు.