సింగిల్ గా ఉన్న వాళ్ళు వాలెంటైన్స్ డేని ఆహ్లాదంగా జరుపుకోవడానికి చేయాల్సిన పనులు
వాలెంటైన్స్ డే అనగానే జంటలు జంటలుగా కనిపించే మనుషులు మాత్రమే చేసుకోవాలని, జంటగా లేని వాళ్ళకు వాలెంటైన్స్ డే దండగ అనీ చాలామంది అభిప్రాయ పడుతుంటారు. అది నిజం కాదు, సింగిల్స్ కూడా వాలెంటైన్స్ డేని హ్యాపీగా జరుపుకోవచ్చు. మీరు సింగిల్ అయితే ఈ వాలెంటైన్స్ డేని ఈ విధంగా సెలెబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సింగిల్స్ పార్టీ: మీ ఇంట్లో పార్టీ అరేంజ్ చేయండి. కేవలం సింగిల్స్ కి మాత్రమే అందులో పాల్గొనాలని కండీషన్ పెట్టండి. పార్టీ రోజు అవసరమైన ఆహారాలు ఆర్డర్ ఇవ్వకుండా మీరే వండండి. సోలో డేట్: ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఎటు చూసినా జనాలే కనిపిస్తారు. ప్రశాంతత కోసం ఒంటరిగా ప్రయాణం చేయండి. మీకు మీరే కొత్తగా కనిపిస్తారు.
వాలెంటైన్స్ డేని ఆహ్లాదంగా జరుపుకోవడానికి సింగిల్స్ చేయాల్సిన పనులు
సోషల్ మీడియాకు దూరం: వాలెంటైన్స్ డే రోజున జంటలు చేసే చిలిపి పనులు మీ కంట కనబడకుండా ఉండాలంటే సోషల్ మీడియాకు దూరమవ్వండి. 24గంటలు ఫోన్ పక్కన పెట్టి, ఇతర హాబీల మీద దృష్టి పెట్టండి. ఆధ్యాత్మిక స్థలానికి వెళ్ళండి: వాలెంటైన్స్ డే రోజున ఇంట్లో బోరింగ్ గా ఉందనుకుంటే ఏదైనా ఆధ్యాత్మిక స్థలానికి వెళ్ళండి. అలా కాకుంటే మీరెప్పుడూ చూడని ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళండి. ఒంటరిగా వెళ్తే కొత్త ఆలోచనలు పుడతాయి. షాపింగ్ మాల్స్: కాలక్షేపం చేయడానికి మాల్స్ కన్నా మంచివి ఏవీ ఉండవు. మీరున్న సిటీలోని అతిపెద్ద షాపింగ్ మాల్ కి వెళ్ళండి. అక్కడ దొరికే వస్తువులను అబ్జర్వ్ చేయండి. అదెందుకు అవసరం పడుతుందో తెలుసుకోండి. కొనకపోయినా తెలుసుకోవడం బాగుంటుంది.