వాలెంటైన్స్ డే: మీ ప్రియమైన వాళ్ళతో డేటింగ్ వెళ్ళాలనుకుంటే ఇలా ట్రై చేయండి
వాలెంటైన్స్ డే ఎంతో దూరంలో లేదు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమించిన వారికి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చేందుకు అందరూ రెడీ అవుతున్నారు. మీరు కూడా ఆ లిస్ట్ లో ఉంటే డేటింగ్ ఐడియాస్ గురించి తెలుసుకోండి. మొదటిసారి కలుసుకున్న చోటుకు వెళ్ళండి: మీరు ప్రేమించిన వారిని మొదటి సారి ఎక్కడ, ఎలా కలుసుకున్నారో అక్కడికి వెళ్ళండి. అప్పుడు ఏ బట్టలు వేసుకున్నారో ఎలా ఉండేవారో అలానే రెడీ అవ్వండి. యాక్టివిటీస్ ప్లాన్ చేయండి: ప్రేమికుల రోజు మొత్తం మీకు నచ్చిన ప్రదేశాలు తిరగండి. రెస్టారెంట్లో లంచ్ చేసి ఇంటికి రావడం కాకుండా ఆరోజు మొత్తం హ్యాపీగా గడిపేలా ప్లాన్ చేయండి. సినిమా చూడటం, వాటర్ పార్క్, వండర్ లా ఇలా ఎక్కడికైనా వెళ్ళండి.
ప్రేమించిన వారితో ప్రేమికులరోజున డేటింగ్ చేయడానికి కావాల్సిన ఐడియాస్
ప్లాన్ లేకుండా ప్లాన్ చేయండి: కొన్నిసార్లు ఎలాంటి ప్లానింగ్ లేకపోతే బాగుంటుంది. ప్లాన్ లేకపోవడం కూడా ఒక ప్లానింగే. అప్పటికప్పుడు రెండు చీటీలు వేసి దాన్లో ఒకటి ఓపెన్ చేసి అందులో ఏమొస్తే అక్కడికి వెళ్ళండి. ఆ ట్రిప్ చాలా అద్భుతగా ఉంటుంది. చాలావరకు ప్లానింగ్ లేకుండా అకస్మాత్తుగా అనుకున్న పనులే సక్సెస్ అవుతాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. డ్రైవింగ్: ఇంట్లో ఉండీ ఉండో బోర్ కొడితే కార్ లేదా బైక్ తీసి లాంగ్ డ్రైవ్ వెళ్ళండి. మీకు నచ్చిన లేదా ఎప్పటి నుండో చూడాలనుకుంటున్న దూర ప్రాంతానికి వెళ్ళండి. అలా బయటకెళ్ళినపుడు కనబడిన వ్యక్తులు, కొత్త ప్రదేశాలు మీ జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.