వాలెంటైన్స్ వీక్ లో వచ్చే హగ్ డే విశేషాలు, కొటేషన్లు
ఫిబ్రవరి నెలలో వచ్చే వాలెంటైన్స్ డే(ఫిబ్రవరి14) కోసం ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. అయితే మీకీ విషయం తెలుసా? వాలెంటైన్స్ డేకి వారం రోజుల ముందు నుండి వాలెంటైన్స్ వీక్ మొదలవుతుంది. ఫిబ్రవరి 7వ తేదీన రోజ్ డే తో ప్రారంభమై ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజుతో వాలెంటైన్స్ వీక్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు (ఫిబ్రవరి 12) హగ్ డేని జరుపుకుంటున్నారు. మనసులోని ప్రేమను మాటల్లో చెప్పలేకపోయినపుడు చేతల్లో దాన్ని చూపించాలంటే కౌగిలింతకు మించి మరో వస్తువు ఏదీ లేదు. ప్రేమించిన వారి కౌగిలిలో బంధీగా ఉన్నప్పుడు ప్రపంచం ఆగిపోతుంది. మనసులో ఉన్న గందరగోళం దూరమై నిశ్శబ్దం అలుముకుంటుంది. ఆ నిశ్శబ్దంలో వినబడే గుండెచప్పుడులో ప్రేమ కనిపిస్తుంది.
హగ్ డే రోజున మీకు ప్రియమైన వారితో పంచుకోవాల్సిన కొటేషన్లు
బాధలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే కౌగిలి, ఆ బాధను దూరం చేయడమే కాదు, బాధకు కారణమైన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. హ్యాపీ హగ్ డే. నీ కౌగిలి నా సౌకర్యం, నీ నవ్వు నాకు వెలుగు, ఇంకా నువ్వు నా జీవితానికి దొరికిన సంతోషం. హ్యాపీ హగ్ డే డియర్. ఈ ప్రపంచంలో ప్రశాంతత ఎక్కడుందని అన్ని చోట్లా వెతికాను, అంతా వెతికి ఇంటికి వచ్చాక గానీ తెలియలేదు, అది నీ కౌగిలిలో దాగుందని. హ్యాపీ హగ్ డే. కౌగిలి కాసుల పేరు, ముద్దు ముత్యపు సేరు అంటారు. నీ కాసుల పేరు నేనైతే, నీ ముత్యపు సేరులో నన్ను తడిపేస్తావా? మనిద్దరమూ కలిసి ప్రేమ నదిలో తడిచేద్దామా? హ్యాపీ హగ్ డే.