సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐస్ వాటర్ ఫేషియల్ వల్ల కలిగే లాభాలు
ఇంటర్నెట్ లో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆలియా భట్, తమన్నా భాటియా, కత్రినా కైఫ్ మొదలైన వారి కారణంగా ప్రస్తుతం ఐస్ వాటర్ ఫేషియల్ బాగా వైరల్ అయ్యింది. బయట ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ వాటర్ ఫేషియల్ బాగా పనిచేస్తుంది. ఈ ఫేషియల్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఐస్ వాటర్ ఫేషియల్ ఎలా చేయాలంటే: చల్లని నీళ్ళని తీసుకుని ఒక పాత్రలో పోసుకోవాలి. ఆ పాత్రలో కొన్ని ఐసుముక్కలను వేయాలి. ఇప్పుడు ఆ నీళ్ళు మరింత చల్లగా మారతాయి. ఆ తర్వాత మీ ముఖాన్ని ఆ చల్లని నీళ్ళలో కొన్ని సెకన్ల పాటు ఉంచాలి.
ఐస్ వాటర్ ఫేషియల్ వల్ల లాభాలు
ఉబ్బడం, ఎర్రగా మారడం తగ్గుతుంది: ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల రక్త కేశనాళికలు కుచించుకుపోతాయి. ఈ కారణంగా ముఖంలో ఉబ్బుదనం తగ్గుతుంది. అంతేకాదు, కళ్ళకింద క్యారీబ్యాగులు కూడా తగ్గిపోతాయి. అయితే కాసేపయ్యాక రక్త కేశనాళికలు వ్యాకోచం చెంది సహజసిద్ధమైన అందాన్ని అందిస్తాయి. చర్మ రంధ్రాలు టైట్ అవుతాయి: చల్లని నీటికారణంగా చర్మ రంధ్రాలు టైట్ గా మారతాయి. దీనివల్ల దుమ్ము, ధూళి చర్మ రంధ్రాల్లో చేరదు. మొటిమలు, బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది. చికాకు తగ్గుతుంది: ఎండ ఎక్కువగా ఉంటే చర్మం చికాకు పెడుతుంటుంది. దీన్ని తగ్గించడానికి ఐస్ వాటర్ ఫేషియల్ బాగా పనిచేస్తుంది.
చర్మ సాధనాలను శోషించుకునే గుణం
చర్మ సాధనాలను శోషించుకునే గుణాన్ని పెంపొందించడంలో ఐస్ వాటర్ ఫేషియల్ పనిచేస్తుంది. మీరు మీ చర్మానికి వాడే చర్మ సాధనాలు, చర్మంలోకి ఈజీగా ఇంకిపోతాయి. సీరమ్స్, మాయిశ్చరైజర్లు చర్మానికి సులభంగా ఇంకిపోతే వాటి పనితీరు మెరుగవుతుంది. తద్వారా మీ చర్మం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. ఐతే ఐస్ వాటర్ ఫేషియల్ ని సున్నితమైన చర్మం ఉన్నవారు వాడకూడదు. ఒకవేళ వాడాలనుకుంటే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి