Cardamom: చిన్న యాలకులు.. పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు..ఈ సమస్యలకు చెక్!
ఈ వార్తాకథనం ఏంటి
యాలకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఔషధాల్లాంటివి. అందుకే వీటిని వంటల్లో, టీ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. కొందరు యాలకులను నీటిలో నానబెట్టి తాగుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. చిన్న గింజలైనప్పటికీ, వీటిలో దాగి ఉన్న ప్రయోజనాలు మాత్రం చాలా గొప్పవే. యాలకులు శరీరానికి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. యాలకుల్లో జింక్, విటమిన్ C, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చాలామంది యాలకులను పర్సులో లేదా ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టుకొని తీసుకెళ్తుంటారు.
Details
జీర్ణక్రియకు మేలు
భోజనం చేసిన తర్వాత యాలకులు నమలడం ఆరోగ్యకరమైన అలవాటు అని వైద్యులు సూచిస్తుంటారు. యాలకుల్లోని విటమిన్లు, సహజ గుణాలు ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గింపు యాలకులు నోటి దుర్వాసనను తొలగించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలోని చెడు బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. దీంతో పాటు చిగుళ్ల వ్యాధుల నుంచి కూడా రక్షణ కలిగిస్తాయి.
Details
గుండె ఆరోగ్యం
యాలకులు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. హై బీపీ ఉన్నవారికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరచి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి యాలకులు ఉపశమనం కలిగిస్తాయి. ఊపిరితిత్తుల్లో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా ఇవి సహాయపడతాయి. మొత్తంగా చూస్తే, రోజువారీ ఆహారంలో యాలకులను సరైన మోతాదులో తీసుకుంటే శరీరానికి అనేక విధాలుగా మేలు చేకూరుతుంది.