
Diwali 2025: దీపావళి రోజున ఈ స్పెషల్ ఫుడ్స్ తప్పకుండా ప్రయత్నించండి
ఈ వార్తాకథనం ఏంటి
హిందువుల సంస్కృతిలో దీపావళి ఒక ప్రత్యేక స్థానం కలిగిన పండుగ. నోరూరించే పిండి వంటలు, మిరుమిట్లుగొలిపే దీపాలు వెలుగులు, హోరెత్తించే టపాసుల శబ్దాలు ఇలా ఎంతో సంబరంగా జరుపుకునే దీపావళి అంటే అందరికి ఎంతో ఇష్టం. ఈ పండుగలో మిఠాయిలకు ఎంతో ప్రత్యేకత ఉంది లక్ష్మీదేవిని ఈ రోజు ప్రత్యేకంగా పూజిస్తారు కాబట్టి, అనేక రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించడం ఒక పరంపరగా ఉంది. తెలుగువారికి ఈ పండుగలోని పిండి వంటలకు ప్రత్యేక ప్రేమ ఉంది. నోరూరించే తెలుగు వంటకాల్లోని కొన్ని తయారీ విధానం మీ కోసం..
వివరాలు
తీపి భూచక్రాలు
తయారీకి కావలసిన పదార్థాలు: మైదా: 1 కప్పు చక్కెర: 1.5 కప్పు పాలు: 1 కప్పు కుంకుమ పువ్వు: చిటికెడు డ్రైఫ్రూట్స్: కొద్దిగా నూనె లేదా నెయ్యి: వేయించడానికి తగినంత తయారీ విధానం: మైదాలో చిటికెడు ఉప్పు,కొద్దిగా బొంబాయి రవ్వ కలిపి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు వేసి చపాతీ పిండి ముద్దలా గట్టిగా కలిపి అర గంట పక్కన పెట్టాలి. పిండిని రోలింగ్ చేసి, పూరీ ఆకారంలో వత్తాలి. మధ్యలో కొద్దిగా నూనె లేదా నెయ్యి,కొద్దిగా పిండి వేసి, ఆ పిండిని చిన్న భాగాలుగా చాకుతో కోసి భూచక్రాల ఆకారంలో చేయాలి. నెయ్యి లేదా నూనెలో ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి.
వివరాలు
మురుకులు
పంచదార, కుంకుమ పువ్వును పాలలో కలిపి వేడి చేసి, వేయించిన భూచక్రాలను అందులో వేసి ముంచాలి. చివరిగా డ్రైఫ్రూట్స్ తో అలంకరించాలి. తయారీకి కావలసిన పదార్థాలు: శనగపిండి: 2 కప్పులు నూనె: 3 కప్పులు బియ్యం పిండి: 4 కప్పులు జీలకర్ర పొడి: 4 టీస్పూన్లు ఉప్పు: తగినంత ఎర్రకారం: తగినంత తెలుపు నువ్వు: 1 కప్పు ఇంగువ: 1/4 టీస్పూను తయారీ విధానం: ముందుగా కొద్దిగా నూనె వేసి శనగపిండిని వేయించాలి.దానిలో బియ్యం పిండి, జీలకర్ర పొడి,ఉప్పు,ఎర్రకారం,నువ్వు,ఇంగువ వేసి బాగా కలపాలి.కొద్దిగా నీళ్లు జోడించి గట్టి ముద్దలా చేసుకోవాలి. మురుకులను ఒత్తే ప్రెస్ ద్వారా ఆకారం చేయాలి.మురుకులను నూనెలో వేసి గోధుమ రంగు వచ్చే వరకు,కర కరలాడేలా డీప్ ఫ్రై చేయాలి.