Spinal Stroke in Kids: పిల్లల్లో స్పైనల్ స్ట్రోక్.. ఎందుకు ఏర్పడుతుందో తెలుసుకోండి
వెన్నుపాములోని ఓ విభాగానికి రక్తసరఫరా నిలిచిపోతే స్పైనల్ స్ట్రోక్ ఏర్పడుతుంది. వెన్నుపాముకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డుపడటం, రక్తం గడ్డకట్టడం వంటి కారణాల వల్ల స్పైనల్ స్ట్రోక్స్ కలుగుతాయి. శరీరంలో వెన్నుపాము కేంద్రనాడీ వ్యవస్థలో కీలక భాగంగా ఉంటుంది. ఇందులోనే మెదడు కూడా ఉంటుంది. స్పైనల్ స్ట్రోక్ సమయంలోవెన్నుపాములో ఓ భాగానికి రక్తసరఫరా నిలిచిపోయి ఆ భాగానికి ఆక్సిజన్, పోషకాలు అందవు. ఫలితంగా కణజాలాలు దెబ్బతింటాయి. దీంతో శరీరంలోని మిగిలిన భాగాలకు నరాల సందేశాలను పంపలేకపోవడం వంటి దుస్థితి కలుగుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ కంటే స్పైనల్ స్ట్రోక్ భిన్నంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.బ్రెయిన్స్ట్రోక్లో మెదుడులోని కొంత భాగానికి రక్తసరఫరా తగ్గిపోతుంది. కానీ స్పైనల్ స్ట్రోక్‌లో దాని ప్రభావం తక్కువగానే ఉంటుంది.
స్పైనల్ స్ట్రోక్ లక్షణాలు ఇవే
స్పైనల్ స్ట్రోక్ లక్షణాలు వెన్నుపాములోని ఏ భాగాన్ని ప్రభావితం చేశాయి. ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై ఆధారపడి ఉంటాయి. పలు సందర్భాల్లో లక్షణాలు ఆకస్మాత్తుగా కనిపిస్తాయి. కొన్నిసార్లు స్ట్రోక్ సంభవించిన కొన్ని గంటల తర్వాత కూడా ఏర్పడవచ్చు. ఆకస్మిక, తీవ్రమైన మెడ లేదా వెన్నునొప్పి. కాళ్లల్లో కండరాల బలహీనత, తిమ్మిరి, జలదరింపు, పక్షవాతం, వేడి లేదా చలిని తట్టుకోలేకపోవడం వంటివి లక్షణాలు అనిపిస్తాయి. స్పైనల్ స్ట్రోక్‌కి కారణాలు వయసు పెరిగే కొద్దీ ధమనులు బలహీనపడి అథెరోస్ల్కోరోసిస్ వస్తుంది. ఇది స్పైనల్ స్ట్రోక్‌కు కారణమవుతుంది. అధిక రక్తపోటు,అధిక కొలెస్ట్రాల్,గుండె వ్యాధి,ఊబకాయం,మధుమేహం లాంటి వల్ల స్పైనల్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ధూమపానం, ఆల్కహాల్ తాగేవారికి, వ్యాయామం చేయని వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.
పిల్లల్లో స్పైనల్ స్ట్రోక్ లేదు
స్పైనల్ స్ట్రోక్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయని, కొందరిలో పక్షవాతం ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మూత్ర, మల విసర్జనను ఆపుకోలేని స్థితి ఏర్పడుతుంది.లైంగికంగా శక్తి తగ్గిపోతుంది.మరికొందరిలో నరాల వ్యవస్థ పూర్తిగా బలహీనపడుతుంది. ఫలితంగా శరీరంలోని పలు భాగాలు పూర్తిగా స్పర్శను కోల్పోయి పుండ్లు ఏర్పడే ప్రమాదముంది. కోలుకోలేని డిప్రెషన్లోకి వెళ్లే ముప్పు ఉంది. ఇది పిల్లలకు వస్తుందా పిల్లల్లో స్పైనల్ స్ట్రోక్ చాలా అరుదు. కొందరి పిల్లలకు పుట్టకతోనే స్పైనల్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉంటుంది. వెన్నుపాముకి గాయం,రక్తనాళాలాలో సమస్యలు, రక్తం గట్టకట్టడాన్ని ప్రభావితం చేసే లక్షణాలు పుట్టకతో వచ్చే పరిస్థితుల వల్ల ఏర్పడతాయి. కావెర్నస్, ధమనులు, సికిల్ సెల్ అనీమియా వంటివి నవజాత శిశువుల్లో కనిపిస్తుంటాయట.