
Surgery: సర్జరీకి ముందు,తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి
ఈ వార్తాకథనం ఏంటి
శస్త్రచికిత్స జరిగినప్పుడు శరీరం ఒత్తిడికి లోనవుతుంది. ప్రమాదాలు వంటివి జరిగినప్పుడు అత్యవసర చికిత్సలు అవసరం, మరొక్కసారి డాక్టర్ ఫలానా తేదీన సర్జరీ చేయాలని నిర్ణయిస్తారు. అటువంటి సమయంలో రోగులు త్వరగా కోలుకోవాలంటే అందుకు తగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం ద్వారా అవసరమైన పోషకాలు అందడం వలన శస్త్రచికిత్స చేయడానికి శరీరం అనుకూలంగా మారుతుంది. అప్పుడు చికిత్స నుండి కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఫ్రీ రాడికల్స్ విడుదల అవుతాయి. అందుకే యాంటీ-ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని చికిత్సకు ముందు, తర్వాత తీసుకోవడం ముఖ్యం. పండ్ల రసం, ఉడకబెట్టిన కూరగాయలు వంటి ఆహారాలు తీసుకుంటే సులభంగా జీర్ణమవుతాయి. చికిత్స తర్వాత బోన్ సూప్ వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
శస్త్రచికిత్స
శస్త్రచికిత్స జరిగినప్పుడు శరీరం అదనపు ఒత్తిడికి లోనవుతుంది
ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శస్త్రచికిత్స అయ్యి ఇంటికి వెళ్ళాక మాములు ఆహారాన్ని తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ సహకరిస్తుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి, వంకాయ, ద్రాక్ష, బెర్రీలు,గుమ్మడికాయ, మామిడి, క్యారెట్, బచ్చలికూర, పాలకూర, ఎర్ర మిరియాలు, గ్రీన్ టీ, బ్రోకలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, గ్రీన్ బీన్స్, టొమాటోలు, గులాబీ రంగు ద్రాక్షపండు, పుచ్చకాయ, మాంసం, పాలు, గింజలు, నారింజ, కివి పండు, అవకాడో, సముద్రపు ఆహారాలలో యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి . శరీరానికి శస్త్రచికిత్స జరిగినప్పుడు దానిపై మందుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే వ్యర్ధ పదార్ధాలను బయటికి పంపేయడానికి కాలేయానికి తగిన మోతాదులో నీరు అవసరం అవుతుంది. అందుకోసం ఆహారం ద్రవం రూపంలో తీసుకోవడం చాలా ముఖ్యం.