హై బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే ఈ ఆహారాలను తీసుకోండి
హై బీపీ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి, గుండె సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రస్తుతం హై బీపీని కంట్రోల్ లో ఉంచే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారాల్లో మెగ్నీషియం, పొటాషియం ఉంటే హై బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి. ప్రస్తుతం మెగ్నీషియం, పొటాషియం మూలకాలు కలిగిన ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. అరటిపండు: ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా శరీరంలో సోడియం ప్రభావాలు నియంత్రణలో ఉంటాయి. అందువల్ల రక్తప్రసరణ కంట్రోల్ లో ఉంటుంది. ఒక మామూలు సైజు అరటిపండులో 375 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. టమాటా, పుట్టగొడుగులు, అవకాడో లో కూడా పొటాషియం ఉంటుంది.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగి ఉన్న ఆహారాలు
బెర్రీస్: స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ మొదలగు వాటిలో ఆంథోక్యాన్సిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఈ కారణంగా హై బీపీ కంట్రోల్ లో ఉంటుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ఆకుకూరలు: పొటాషియం, మెగ్నీషియం వంటి మూలకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా కాల్షియం ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. చేపలు: టూనా, సాల్మన్, మాకేరెల్ మొదలగు వాటిల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు హై బీపీని నియంత్రించడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ ని మరీ ఎక్కువగా కాకుండా కొంత మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.