రాపిడి వల్ల తొడల మధ్య కలిగే దురదతో పాటు ఇతర సమస్యలను దూరం చేసే టాల్కం పౌడర్
టాల్కమ్ పౌడర్ ప్రతీ ఇంట్లోనూ ఉంటుంది. మేకప్ కిట్ లో మేజర్ పొజిషన్ టాల్కమ్ పౌడర్ దే అయ్యుంటుంది. ఈ టాల్కమ్ పౌడర్ ని అందంగా రెడీ అవ్వడానికే కాదు అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఆ రకాలేంటో, ఏ రకంగా ఉపయోగిస్తే ఏ ఫలితం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం. కనురెప్పల వెంట్రుకలు మందంగా అయ్యేందుకు: మీ కనురెప్పల వెంట్రుకలు సన్నగా ఉండడం వల్ల కళ్ళు అందంగా కనిపించడం లేదా? ఐతే మీరు టాల్కమ్ పౌడర్ ని వాడవచ్చు. పౌడర్ వల్ల కనురెప్పల వెంట్రుకలు అతికొద్ది కాలంలోనే మందంగా మారతాయి. దీనికోసం ఇయర్ బర్డ్స్ తీసుకుని పౌడర్ ని రెప్ప వెంట్రుకలకు అద్దాలి. ఆ తర్వాత రెప్ప వెంట్రుకలకు మస్కరా పెట్టుకోవాలి.
జుట్టులో చుండ్రు నుండి తొడల మధ్య దురదను పోగొట్టే టాల్కమ్ పౌడర్
పొడి షాంపూలా పనిచేసే టాల్కమ్ పౌడర్: జుట్టు జిడ్డుగా ఉన్నప్పుడు, దురద మొదలై చుండ్రు ఏర్పడుతుంది. చుండ్రును పోగొట్టుకోవాలంటే కొంచెం పౌడర్ ని నెత్తిమీద జల్లుకుని బాగా రుద్దండి. దీనివల్ల మీ జుట్టుపై పేరుకున్న అనవసర నూనె తగ్గిపోతుంది. చుండ్రు తయారు కాకుండా ఉంటుంది. అవాంఛిత వెంట్రుకల్ను తొలగించినపుడు కలిగే నొప్పిని టాల్కమ్ పౌడర్ దూరం చేస్తుంది. వెంట్రుకలను తొలగించలనుకున్నప్పుడు ఆ ప్రదేశంలో పౌడర్ వేసి తొలగించండి. తొడల మధ్య రాపిడి జరిగి దురద కలిగితే, టాల్కమ్ పౌడర్ ని జల్లుకోండి. దానివల్ల ఆ ప్రాంతాల్లోని తడి మాయమవుతుంది. తద్వారా దురద కలగదు. మీ చర్మం పాడవదు. ఇంకా చెమటల వచ్చే దుర్వాసన పోగొట్టుకోవడానికి టాల్కమ్ పౌడర్ ని వాడవచ్చు.