
మీ శరీరంలో నుండి విష పదార్థాలను తొలగించే టీ రకాలు మీకోసమే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే డ్రింక్ ఏదైనా ఉందంటే అది టీ మాత్రమే. టీ కారణంగా నరాలు ఉత్తేజితం అవడమే కాకుండా జీవక్రియ మెరుగ్గా అవుతుంది.
బరువు తగ్గాలన్న లక్ష్యం మీకుంటే కొన్ని టీ రకాలు మీకు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే శరీరంలోని విష పదార్థాలు బయటకు పోవాలంటే మరొకొన్ని టీ రకాలు పనిచేస్తాయి. ప్రస్తుతం ఆ టీ రకాలు చూద్దాం.
పసుపు టీ:
పసుపులోని పోషకాల వల్ల కాలేయం పనితీరు మెరుగుపడటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒకపాత్రలో నీళ్ళు తీసుకుని, అల్లం ముక్కలు, నల్లమిరియాలు, తేనే వేసి, ఆ మిశ్రమం మొత్తం సగమయ్యేంత వరకు మరిగించాలి. ఇప్పుడు తేయాకు వేసి మరిగించి వడబోసి తాగాలి.
Details
అసిడిటీని తగ్గించే టీ రకం
జీలకర్ర టీ:
బరువు తగ్గడానికి, శరీరంలోంచి మలినాలను తొలగించడానికి ఈ టీ బాగా పనిచేస్తుంది.
జీలకర్ర, వాము తీసుకుని ఒక గ్లాసులో ఒక రాత్రంతా నానబెట్టాలి. ఇప్పుడు ఆ నీటిని మరిగించి అందులో తేయాకు వేసి 5నిమిషాలు మరిగించాలి. వడబోసి నిమ్మరసం కలుపుకుని తాగాలి.
ఉసిరి టీ:
ఒక పాత్రలో నీళ్ళు పోసి, దానికి ఉసిరిపొడి, తేయాకు, ఎండిన అల్లం పొడి కలిపి మరిగించాలి. ఉప్పు, తేనే కలుపుకుని తాగితే అద్భుతంగా ఉంటుంది.
సోంఫు టీ:
వికారం, అసిడిటీ, ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలను తగ్గించేస్తుంది. జీలకర్ర, ధనియాలు, సోంఫు గింజలను 10నిమిషాలు నీళ్లలో మరగబెట్టాలి. గ్రీన్ టీ ఆకులను కలిపి నెమ్మదిగా మరిగించాలి. తర్వాత వడబోసి తాగాలి.