
Auspicious Days: ఈ కొత్త సంవత్సరంలో ఎన్ని నెలల పాటు ముహుర్తాలు ఉన్నాయో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలతో పాటు, భారతదేశవ్యాప్తంగా ఈ రోజు ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని దేవాలయాలలో విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని పఠించి భక్తులకు వినిపించారు. విశ్వావసు నామ సంవత్సరంలో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు వెల్లడించారు. ముఖ్యంగా అక్టోబర్ నెలలో 10 మంచి రోజులు ఉండగా, 2025 జులైలో కేవలం రెండు మంచి రోజులు మాత్రమే ఉన్నాయి. ఇక నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఏవైనా శుభ ముహూర్తాలు లేవని సిద్ధాంతకర్తలు తెలిపారు.
వివరాలు
విశ్వావసు నామ సంవత్సరంలో శుభ ముహూర్తాల వివరాలు:
ఏప్రిల్: 6, 16, 18, 20, 23,30 మే: 1, 8, 9, 11, 17,18, 28 జూన్: 1, 2, 5, 6, 7, 8 జులై: 16, 30 ఆగస్టు: 1, 4, 7, 8, 9, 10,13, 14, 17 సెప్టెంబర్: 26, 27 (కేవలం రెండు రోజులు) అక్టోబర్: 1, 2, 3, 4, 6, 8, 10, 11, 22, 24 నవంబర్: శుభ ముహూర్తాలు లేవు డిసెంబర్: శుభ ముహూర్తాలు లేవు జనవరి: శుభ ముహూర్తాలు లేవు ఫిబ్రవరి (2026): 19,21, 22,25, 26, 27, 29 మార్చి: 4, 5, 7, 8, 11 మంచి రోజులు ఉన్నాయని సిద్ధాంత కర్తలు చెబుతున్నారు.