LOADING...
Karthika Masam: కార్తీక మాసం 22వ రోజు ప్రత్యేకత.. ఇలా చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి!
కార్తీక మాసం 22వ రోజు ప్రత్యేకత.. ఇలా చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి!

Karthika Masam: కార్తీక మాసం 22వ రోజు ప్రత్యేకత.. ఇలా చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

కార్తీకమాసంలో ప్రతి రోజూ ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగివుంటుంది. నవంబర్ 12, బుధవారం కార్తీక మాసం 22వ రోజు, ఈ రోజు అష్టమి తిథితో కలసి రావడం వల్ల దీనిని 'బుధాష్టమి' అని పిలుస్తారు. ఈ రోజు శత్రు బాధలు, దృష్టిదోషాలు తొలగి, ఆర్థిక పురోభివృద్ధి కలిగించేదిగా భావించబడుతుంది. ఈ సందర్భంలో ఏ విధి విధానాలు పాటిస్తే అనుకూల ఫలితాలు పొందవచ్చో చూద్దాం.

Details

గురుపాద పూజతో ప్రారంభించాలి

బుధాష్టమి రోజున ముఖ్యంగా గురువులను పూజించడం చాలా శుభకరంగా ఉంటుంది. చదువు చెప్పిన గురువు కాని, జ్ఞానం అందించిన గురువు కాని — వారి పాదాలను నీటితో కడిగి, ఆ నీటిని తలపై చల్లుకోవాలి. ఇలా చేస్తే జాతకంలో గురు గ్రహ బలం పెరుగుతుంది. గురు దోషాలు తొలగిపోతాయి. శివార్చనకు ప్రత్యేక పుష్పాలు, పత్రాలు ఈ రోజు శివుడిని విశిష్టమైన పుష్పాలు, ఆకులతో పూజించడం ద్వారా వివిధ ఫలితాలు కలుగుతాయి గరికపోచలతో పూజిస్తే తెలివితేటలు, మేధాశక్తి పెరుగుతాయి.

Details

ఉమ్మెత్త ఆకులతో పూజిస్తే అనారోగ్యాలు దూరం

ఉమ్మెత్త పూలతో పూజిస్తే మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నవారు ఇలా చేయడం మంచిది. ఉమ్మెత్త ఆకులతో పూజిస్తే అనారోగ్యాలు దూరమవుతాయి. మారేడు దళాలతో (2, 4, 8, 10, 12 సంఖ్యల్లో) పూజిస్తే ఆర్థిక స్థితి మెరుగవుతుంది, ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

Details

బుధాష్టమి - కాలాష్టమి మహిమ

ఈ రోజు కాళభైరవుడికి ఎంతో ప్రియమైనది. బ్లాక్ మ్యాజిక్, శత్రు బాధలు, నెగిటివ్ ఎనర్జీ వంటి సమస్యలను తొలగించడానికి ఈ రోజున ప్రత్యేకంగా 'మిరియాల దీపం' వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. మిరియాల దీపం తయారీ, విధానం 1. ఒక కొత్త తెల్లటి వస్త్రం తీసుకొని అందులో 27 మిరియాలు పెట్టి చిన్న మూట కట్టాలి. 2. ఆ మూటను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వుల నూనెలో నానబెట్టాలి. 3. సాయంత్రం సమయానికి కాళభైరవుడి ఆలయానికి వెళ్లి, మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి, ఆ నానిన మిరియాల మూటను ఒక ఒత్తిలా వేసి దీపం వెలిగించాలి. 4. ఇలా చేయడం సాధ్యంకాకపోతే, ఇంట్లో పడమర వైపు దీపం వెలిగించవచ్చు.

Details

ఇంటికి శాంతి కలుగుతుంది

ఈ మిరియాల దీపం బ్లాక్ మ్యాజిక్‌, రహస్య శత్రువులు, నెగిటివ్ ఎనర్జీ వంటి ప్రభావాలను తొలగించి ఇంటికి శాంతి, సమృద్ధి తీసుకువస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే, ఈ కార్తీక మాస బుధాష్టమి రోజు గురుపూజ, శివార్చన, మిరియాల దీపం వంటి విధులను ఆచరిస్తే జీవితం నుండి దోషాలు, కష్టాలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు.