
ఫ్రూట్ మిల్క్ షేక్స్ తాగితే గ్యాస్ వస్తుందా? అసలు పండ్లు తినేటపుడు చేయకూడని పొరపాట్లు ఏమిటో తెలుసుకుందాం
ఈ వార్తాకథనం ఏంటి
పండ్లను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే శరీరానికి కావలసిన పోషణ సరిగ్గా అందుతుంది. పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఇంకా ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.
సాధారణంగా పండ్లను స్నాక్స్ లాగా తింటుంటారు. అయితే పండ్లు తినేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాట్లు ఏమిటో, వాటిని చేయడం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రిపూట పండ్లు తినడం
మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. సూర్యాస్తమయం కాకముందే పండ్లు తినడం ఉత్తమం. ఎందుకంటే, పండ్లలోని పోషకాలను తీసుకునే సామర్థ్యం రాత్రిపూట శరీరానికి తగ్గిపోతుంది.
అంతేకాదు రాత్రిపూట పండ్లు తింటే నిద్ర సరిగ్గా పట్టకపోయే అవకాశం ఉంది.
Details
పీహెచ్ స్థాయిలను అసమతుల్యం చేసే నీళ్ళు
పండ్లు తినగానే నీళ్లు తాగడం
వాటర్ మెలన్, నారింజ, స్ట్రాబెర్రీ మొదలగు పండ్లను తినగానే నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థలోని పీహెచ్ స్థాయిలు అసమతుల్యం అవుతాయి. కాబట్టి పండ్లు తినగానే నీళ్లు తాగవద్దు.
ఫ్రూట్ కాంబినేషన్లలో తప్పులు
మీరు తియ్యటి పండ్లను తింటున్నప్పుడు అందులో సిట్రస్ పండ్లు ఉండకూడదు. ఎందుకంటే ఒక్కో రకమైన పండు ఒక్కో రకమైన జీర్ణరసాన్ని మీ కడుపులో విడుదల చేస్తుంది. ఉదాహరణకు మీరు వాటర్ మెలన్ తినాలనుకుంటే అదొక్కటి మాత్రమే తినాలి.
అన్నం తినగానే పండ్లు తినడం
పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. భోజనం చేయగానే మీరు పండ్లు తిన్నట్లయితే జీర్ణక్రియ ఆలస్యంగా అవుతుంది. ఒక్కోసారి కడుపునొప్పి కలగవచ్చు.
Details
మిల్క్ షేక్ చేసే ఇబ్బంది
భోజనం చేసిన, అరగంట లేదా గంట తర్వాత మాత్రమే పండ్లను తినాలి.
పాలతో పండ్లను కలపకూడదు
మిల్క్ షేక్స్ మీకు బాగా ఇష్టమైతే ఆ అలవాటు వెంటనే మానుకోండి. పాలలో ఉండే పోషకాలు వేరు, పండ్లలో ఉండే పోషకాలు వేరు. పాల కంటే పండ్లు తొందరగా జీర్ణం అవుతాయి.
ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. ఫలితంగా గ్యాస్, ఉబ్బరం ఇంకా ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి.