LOADING...
International women's day 2025: భారతదేశాన్ని గర్వపడేలా చేసిన వీరనారిమణులే వీరే!
భారతదేశాన్ని గర్వపడేలా చేసిన వీరనారిమణులే వీరే!

International women's day 2025: భారతదేశాన్ని గర్వపడేలా చేసిన వీరనారిమణులే వీరే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2025
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతేడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటారు. 1908లో ప్రారంభమైన ఈ వేడుకలకు ఐక్యరాజ్య సమితి 1975లో అధికారిక గుర్తింపు ఇచ్చింది. అప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులను ప్రోత్సహించేందుకు, సమానత్వాన్ని ప్రేరేపించేందుకు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది ఈ దినోత్సవం ప్రధానంగా మహిళల హక్కులను ప్రోత్సహించడం, సమానత్వాన్ని సాధించడం, అలాగే ప్రపంచ శాంతిని కాపాడటంలో వారి పాత్రను గుర్తించడం లక్ష్యంగా ఉంది. అనేక దేశాల్లో ఇప్పటికీ మహిళలు తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సి వస్తున్నా కాలక్రమేణా పరిస్థితి మెరుగవుతోంది. మహిళలు రాజకీయాలు, విద్య, కళలు, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం వంటి అనేక రంగాలలో భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Details

 భారత మహిళల విజయగాథలు 

భారతదేశంలో అనేక రంగాలలో తొలి అడుగు వేసిన మహిళలు, అనేక విజయాలను సాధించి, భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తున్నారు. 1. ఆనందీబాయి గోపాల్ రావ్ జోషి 1887లో భారతదేశపు తొలి మహిళా వైద్యురాలిగా గుర్తింపు పొందారు. పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన తొలి భారతీయ మహిళగా, అమెరికా వెళ్లిన తొలి మహిళగా చరిత్రలో నిలిచారు. ఆమె ప్రేరణతో అనేక మంది భారతీయ మహిళలు వైద్య రంగంలో అడుగుపెట్టారు. 2. షీలా దావ్రే భారతదేశపు తొలి మహిళా ఆటో రిక్షా డ్రైవర్. మహారాష్ట్రలోని పూణెలో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఇతర మహిళలకు మార్గదర్శకురాలిగా నిలిచారు. మహిళల కోసం డ్రైవింగ్ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Details

 3. అరుణిమా సిన్హా 

భారతదేశం నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ. జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణిగా రాణించిన ఆమె, ప్రమాదంలో కాలు కోల్పోయినప్పటికీ, ఒంటికాలితోనే ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. 4. రీటా ఫరియా పావెల్ మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న తొలి ఆసియా మహిళ. డాక్టర్‌గా అర్హత పొందిన తొలి మిస్ వరల్డ్ విజేత కూడా. ఆమె విజయంతో భారతీయ మోడలింగ్ రంగానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 5. ఆర్తి సాహా 1959లో ఇంగ్లీష్ ఛానెల్ ఈత కొట్టిన తొలి భారతీయ మహిళ. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా మహిళ కూడా. 1960లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.

Details

6. మిథాలీ రాజ్ 

భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న మిథాలీ, టెస్టు క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ చేసిన మహిళ. 2004లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 214 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 7. ఇందిరా గాంధీ భారతదేశపు తొలి మహిళా ప్రధాన మంత్రి. 1966-1977 మధ్య కాలంలో ప్రధానిగా సేవలందించారు. 1999లో 'ఉమెన్ ఆఫ్ ది మిలేనియం'గా బిబిసిలో గుర్తింపు పొందారు. 1971లో భారతరత్న అవార్డును అందుకున్న తొలి భారత మహిళ. 8. కల్పనా చావ్లా భారతదేశం నుంచి అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళ. 1997లో మిషన్ స్పెషలిస్ట్‌గా, రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్‌గా అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆమె భారత యువతకు అంతరిక్ష పరిశోధనలో స్ఫూర్తిగా నిలిచారు.

Details

9. కిరణ్ బేడీ 

భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ (IPS) అధికారి. 2003లో ఐక్యరాజ్యసమితి సివిల్ పోలీస్ సలహాదారుగా నియమితులయ్యారు. తన సేవల ద్వారా పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చారు. 10. అంజలి గుప్తా భారత వైమానిక దళంలో కోర్టు మార్షల్‌కు గురైన తొలి మహిళ. ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్‌లో పనిచేశారు. ఆమె నడిపించిన చర్చలు భారత వైమానిక దళంలోని లింగ సమానత్వంపై దృష్టి పెట్టేలా చేశాయి. ఈ మహిళలు వారి కృషితో భారతదేశాన్ని గర్వపడేలా చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా, ఈ మహనీయుల విజయాలను గుర్తుచేసుకుని, మహిళల హక్కులను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సమాజంలో మహిళల పాత్ర మరింత బలపడేలా చర్యలు తీసుకోవడం అందరి బాధ్యత.