LOADING...
Motivation: జీవితం, మృతి ఈ రెండింటికీ తోడుగా నిలిచే మిత్రులు వీళ్లే!
జీవితం, మృతి ఈ రెండింటికీ తోడుగా నిలిచే మిత్రులు వీళ్లే!

Motivation: జీవితం, మృతి ఈ రెండింటికీ తోడుగా నిలిచే మిత్రులు వీళ్లే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2025
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

"విద్యా మిత్రం ప్రవాసేషు భార్యా మిత్రం గృహేషు చ | వ్యాధితస్యౌషధం మిత్రం ధర్మో మిత్రం మృతస్య చ | ఈ శ్లోకం ప్రకారం, మన జీవితంలో వివిధ దశల్లో తోడుండే మిత్రుల గురించి చాణక్యుడు సునిశితంగా వివరించారు. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రవాసంలో విద్యే మిత్రం: మనం దేశం వదిలి ఎక్కడికైనా వెళ్లినప్పుడు మనకు తోడుగా నిలిచేది విద్య మాత్రమే. ఎక్కడికైనా వెళ్లినా మనకు గుర్తింపు కలిగించే సామర్థ్యం కలిగి ఉండేది విద్యే. ఇంట్లో భార్యే మిత్రం: ఒక పురుషుడికి గృహస్థ జీవితంలో నిజమైన స్నేహితురాలు అతని భార్యే. సుఖంలోనూ, దుఖంలోనూ అతడికి తోడుండే వ్యక్తి భార్య మాత్రమే.

Details

రోగ సమయంలో ఔషధమే మిత్రం

ఆరోగ్యం బాగోలేని సమయంలో మన జీవితాన్ని రక్షించే మిత్రం ఔషధం. సరైన మందు లేకపోతే ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. మరణానంతరం ధర్మమే మిత్రం మనం మరణించిన తర్వాత కూడా మనతో ఉండే స్నేహితుడు ధర్మమే. మన పుణ్యపాపాలు మనకు తోడుగా వస్తాయి. అప్పుడు ధర్మమే మనను రక్షించగలదు. ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు చెబుతున్నది ఏమిటంటే, సమయానుకూలంగా ఎవరు మనకు సహాయపడతారో వారే నిజమైన మిత్రులు. ఇది మనం చదివి అర్థం చేసుకోవాల్సిన ప్రాథమిక బోధన ప్రతిస్థితిలో మన జీవితంలో మారిపోతూ ఉండే మిత్రులను ఆదరించాలి. ధర్మాన్ని జీవనవిధిగా అలవర్చుకోవాలి.