LOADING...
Motivation: పెళ్లి తర్వాత భార్యను బాధపెట్టే పురుషులు వీరే! 
పెళ్లి తర్వాత భార్యను బాధపెట్టే పురుషులు వీరే!

Motivation: పెళ్లి తర్వాత భార్యను బాధపెట్టే పురుషులు వీరే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవితానుభవాల ఆధారంగా రచించిన 'చాణక్య నీతి' గ్రంథం, నేటి సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడే దారులు చూపుతోంది. సమాజ నిర్మాణం, బంధాల పటిష్టత గురించి ఆయన చెప్పిన సూచనలు తరతరాలకూ వర్తించేవే. వివాహ సంబంధాల్లో పురుషుల ప్రవర్తనపై ఆయన కొన్ని కీలకమైన హెచ్చరికలు చేశారు. కొన్ని లక్షణాలు ఉన్న పురుషులతో వివాహం చేస్తే ఆ మహిళ జీవితం పూర్తిగా నాశనం కావడం ఖాయం అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం:

Details

1. సోమరితనం ఉన్నవారు

చాణక్యుడి అభిప్రాయం ప్రకారం, సోమరిగా ఉండే పురుషులు కుటుంబానికి భారం అవుతారు. ప్రతీ పనిని వాయిదా వేస్తూ భార్యను మానసికంగా వేదిస్తారు. వారికి బాధ్యతా భావం లేకుండా ఉంటుంది. 2. ఆర్థిక అసమర్థత ఒక పురుషుడు తన ఆర్థిక స్థితిని పెంచే ప్రయత్నం చేయకపోతే, వివాహానంతరం భార్యపై ఆధారపడతాడు. ఇది కుటుంబ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. భార్యపై ఒత్తిడి పెరుగుతుంది. 3. మద్యపానం, మాదకద్రవ్యాలకు అలవాటు మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారినవారు క్రమశిక్షణ కోల్పోతారు. వారు కుటుంబానికి పెద్ద భారం అవుతారు. ఈ అలవాట్లు భార్య జీవితాన్ని బాధితురాలిగా మారుస్తాయి.

Details

4. అతి కోపం, హింసాత్మక స్వభావం

ఎక్కువగా కోపపడే స్వభావం ఉన్న పురుషులు తమ భార్యకు భద్రత కలిగించలేరు. వారితో జీవించడం మహిళలకు మానసిక, శారీరక భయాలు కలిగించేలా ఉంటుంది. 5. బాధ్యతల నిర్వహణలో వైఫల్యం కుటుంబ బాధ్యతలు తీసుకోవాలన్న భావన లేకుండా ఉండే పురుషుల వల్ల, భార్యలపై బాధ్యతల భారం అధికమవుతుంది. దీని వల్ల ఆమె శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతుంది.

Details

6. చెడు ప్రవర్తన, అసభ్యంగా ఉండే స్వభావం 

అసభ్యంగా, చెడ్డ ప్రవర్తనతో ఉండే వారు తమ గౌరవాన్ని కోల్పోతారు. అంతేగాక, భార్యలో కూడా తమ విలువను తక్కువ చేసుకుంటారు. ఇది ఆ బంధాన్ని బలహీనంగా చేస్తుంది. చాణక్యుని నీతులు నేటికీ ఎంత అర్థవంతంగా వర్తిస్తాయో ఈ సూచనల ద్వారానే అర్థమవుతుంది. సంసార జీవితాన్ని శాంతియుతంగా, గౌరవంగా గడపాలంటే - ఈ లక్షణాలను గుర్తించి, వీటి దూరంగా ఉండటం ఎంతో అవసరం.