చాట్ జీపీటీని ఉపయోగించి రోజువారి పనులను సులభం చేసుకోండిలా
ఏఐ.. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది. దానికి ముఖ్య కారణం చాట్ జీపీటీ. చాట్ జీపీటీ కారణంగా చాలా పనులు సులువుగా మారిపోతున్నాయి. మన ప్రస్తుతం జీవన విధానంలో చాట్ జీపీటీనీ రోజువారి పనుల్లో ఎలా ఉపయోగించవచ్చో, దానివల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం. తప్పులు లేకుండా ఈ-మెయిల్ రాయడం: శాలరీ పెంచమని మీ బాస్ కు ఈ-మెయిల్ రాయలని అనుకున్నారనుకోండి. చాట్ జీపీటీలోకి వెళ్ళి, శాలరీ పెంచమని బాస్ కు ఈ-మెయిల్ రాయమని టైప్ చేస్తే చాలు. అదే రాసి పెడుతుంది. మీరెంత వివరంగా కమాండ్స్ ఇస్తే అది అంత వివరంగా రాసి పెడుతుంది. అది కూడా ఎలాంటి తప్పులు లేకుండా.
చిన్నపిల్లలకు చెప్పినట్లుగా అర్థం చేయించే చాట్ జీపీటి
ట్రిప్స్ ప్లాన్ చేస్తుంది: ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటే, ట్రావెల్ ప్లాన్ ని మీకందిస్తుంది. అమెరికా వెళ్లడానికి ఏమేం ప్లాన్ చేసుకోవాలో తెలియజేమని అడిగితే, మీకు కావాల్సిన మొత్తం ప్లాన్ వస్తుంది. అర్థం కాని విషయాలను అర్థం చేయిస్తుంది: ఉదాహరణకు క్వాంటమ్ మెకానిక్స్ మీకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని మీరు, క్లియర్ గా తెలియజేసి, చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్పమని అడిగితే, మంచి మంచి ఉదాహరణలతో చెబుతుంది చాట్ జీపీటి. కాంట్రక్ట్ లో తప్పులను వెతుకుతుంది: రెంటల్ అగ్రిమెంట్ లేదా మరేదైనా అగ్రిమెంట్ లలో ఏదైనా తప్పులు ఉంటే మీకు తెలియజేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఆ అగ్రిమెంట్ కాపీని చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తే సరిపోతుంది.