LOADING...
#NewsBytesExplainer: హైదరాబాద్ పరిధిలో గణేష్ మండపం ఏర్పాటు చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
గ్రేటర్ పరిధిలో గణేష్ మండపం ఏర్పాటు చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

#NewsBytesExplainer: హైదరాబాద్ పరిధిలో గణేష్ మండపం ఏర్పాటు చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో గణేష్ మండపం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లయితే,కొన్ని ముఖ్యమైన నిబంధనలు,అనుమతులు తప్పనిసరిగా పాటించాలి. ఈరోజుల్లో ప్రతి గల్లీలో ఒక గణేష్ మండపం ఏర్పడుతున్నప్పటికీ,అనేకరికి ఈ నియమాలపై స్పష్టత లేదు. 1. అనుమతులు: పబ్లిక్ ప్రదేశాల్లో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి సంబంధిత డివిజనల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నుండి ముందస్తు రాత అనుమతి తీసుకోవాలి. ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు. దానికి సంబంధించి తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్ https://www.tspolice.gov.in వెబ్‌సైట్‌లో ఇంటిమేషన్ ఫారమ్ సమర్పించాలి. అయితే,అపార్ట్‌మెంట్లు లేదా ప్రైవేట్ ఇళ్లలో,ప్రజలకు యాక్సెస్ కాని విగ్రహాల కోసం ఈ నియమాలు వర్తించవు. మండపం ప్రైవేట్ భూమిలోనైనా లేదా ప్రభుత్వ భూమిలోనైనా,ల్యాండ్ ఓనర్ నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC)పొందటం తప్పనిసరి.

వివరాలు 

2. విద్యుత్ కనెక్షన్లు:

అనధికారిక విద్యుత్ కనెక్షన్లు పూర్తిగా నిషిద్ధం. అధికారిక విద్యుత్ కనెక్షన్ కోసం TGSPDCL (Telangana State Distribution Company Limited) నుండి సర్టిఫికేట్ పొందాలి. 3. లైటింగ్, సౌండ్: సీరియల్ లైట్స్ లేదా డెకరేషన్ లైట్స్ మాత్రమే ఉండాలి.. మండపం వెలుపల లైటింగ్ నిషిద్ధం. ఒక్కో మండపంలో గరిష్టంగా రెండు బాక్స్-టైప్ లౌడ్‌స్పీకర్లు మాత్రమే అనుమతించబడతాయి. రాత్రి 10:00 PM నుండి ఉదయం 6:00 AM వరకు లౌడ్‌స్పీకర్లు లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు వినిపించకూడదు. శోభాయాత్ర సమయంలో DJలను ఏర్పాటు చేయడం సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం నిషిద్ధం.

వివరాలు 

4.భద్రత,వాలంటీర్లు:

నిర్వాహకులు తగిన గుర్తింపు కార్డులు, బ్యాడ్జ్‌లు ధరించిన వాలంటీర్లను నియమించాలి. వాలంటీర్లు భక్తుల క్యూలను సక్రమంగా నిర్వహించడం, భద్రత, ఫైర్ సేఫ్టీ చర్యలను పాటించడం వంటి బాధ్యతలు వహించాలి. మండపం వద్ద కనీసం 24 గంటల పాటు ఒక వాలంటీర్ ఉండేలా చూడాలి. CCTV కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

వివరాలు 

5. ట్రాఫిక్, శోభాయాత్రలు:

మండపాలు ట్రాఫిక్‌కు అడ్డంకి కలిగించకూడదు లేదా పబ్లిక్ ఆర్డర్‌ను భంగం కలిగించకూడదు. శోభాయాత్రల కోసం పోలీస్ క్లియరెన్స్‌లో ఇవ్వబడిన రూట్‌లు, టైమింగ్‌లను ఖచ్చితంగా పాటించాలి. 6. ఇతర వివరాలు: ఆన్‌లైన్ దరఖాస్తు కోసం Telangana Police వెబ్‌సైట్ ను ఉపయోగించవచ్చు. మండప నిర్వాహకులు తమ కమిటీ వివరాలు, బాధ్యతలు వహించే వ్యక్తుల వివరాలు, ఫోన్ నంబర్లు మండపంలో ప్రదర్శించాలి. సమస్యలు ఎదురైనప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చు లేదా హైదరాబాద్ సిటీ పోలీస్ హెల్ప్‌లైన్ 8712665785 లో సహాయం పొందవచ్చు.

వివరాలు 

6.ప్రత్యేక కేటగిరీలు:

గత సంవత్సరం అనుమతి పొందిన గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించింది. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ఉన్న మండపాలకు పోలీస్ అనుమతి అవసరం ఉండదు, కానీ స్థానిక పోలీస్ స్టేషన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాలి.