Health Care: ఇలా చేస్తే 40ఏళ్ళ తరువాత కూడా.. మీరు ఫిట్‌గా ఉంటారు..!
40 ఏళ్ల తర్వాత చక్కటి సమతుల్య ఆహారాన్ని అనుసరించడం ఆరోగ్యకరమైన జీవితానికి కీలకం.మీ ఆహారపు అలవాట్లు,జీవనశైలిని పునఃపరిశీలించుకోవడానికి ఇది మంచి సమయం. హైపర్‌టెన్షన్,డయాబెటిస్,థైరాయిడ్,రోగనిరోధక తక్కువగా ఉండటం, ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురికావడం వంటి సమస్యల కారణంగా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా కష్టం. ఈ సమయంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి పోషకాహారం ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం దృఢంగా ఉంచుతుంది. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి. 1. ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి మీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, విత్తనాలు, దంపుడు బియ్యం, బార్లీ, ఓట్స్, విత్తనాలు, పండ్లు, పప్పుధాన్యాలు చేర్చుకోండి. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించండి, ఇంట్లో తయారుచేసిన భోజనాన్ని మాత్రమే ఎంచుకోండి.
2. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్..
మీ డైట్‌లో యాంటీఇన్ఫ్లమేటరీ,యాంటీఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండే పసుపు,గ్రీన్ టీ, క్యాప్సికమ్,తాజా పండ్లు,బెర్రీస్‌ను చేర్చుకోవడం వల్ల కీళ్లు నొప్పులు,నడుము నొప్పి వంటి సమస్యలూ దూరం చేస్తుంది. 3. ప్రొటీన్ రిచ్ ఫుడ్స్.. డైట్‌లో ప్రొటీన్ ఎక్కువగా ఉండే.. చికెన్, టోఫు, సోయాబీన్, పప్పులు, గుమ్మడి గింజలు, గుడ్లు తినడం వల్ల 40 ఏళ్ళ వయస్సులో కూడా మీరు యవ్వనంగా ఉంటారు. 4.హెల్తీ ఫ్యాట్స్ అవకాడోలు,ఆలివ్,నట్స్, గింజలు, చేప నూనె, సాల్మన్ వంటి ఆహారం చేర్చుకోండి. ఇందులో ఉండే హెల్తీ ఫ్యాట్స్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సమస్యలు రాకుండా రక్షిస్తుంది. వీటిలో ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. 5. సోడియం తీసుకోవడం తగ్గించండి అధిక సోడియం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సోడియం స్థాయిలను తగ్గించడం ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేసిన ఆహారాలను తగ్గించండి. ఉప్పుకు బదులుగా మూలికలు, సుగంధ ద్రవ్యాలతో రుచిగా ఉండే భోజనం తినండి.
5. సోడియం తీసుకోవడం తగ్గించండి
అధిక సోడియం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సోడియం స్థాయిలను తగ్గించడం ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. ప్రాసెస్ చేయబడిన,ప్యాక్ చేసిన ఆహారాలను తగ్గించండి. ఉప్పుకు బదులుగా మూలికలు, సుగంధ ద్రవ్యాలతో రుచిగా ఉండే భోజనం తినండి.