
Diwali 2025: దీపావళి జరుపుకోవడానికి కారణం ఇదే.. దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక చరిత్రను తెలుసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి అనేది దేశవ్యాప్తంగా భక్తి, ఆనందంతో జరుపుకునే ప్రధాన పండుగ. దీపావళి వేడుకలు కొన్ని ముఖ్యమైన పురాణ, చారిత్రక సందర్భాలకు సంబంధించినవిగా ఉన్నాయి. రామాయణం ప్రకారం రామచంద్రుడు రావణాసురుడిపై విజయం సాధించి సీతా, లక్ష్మణులతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని జరుపుకోవడానికి ఇళ్లు, నగరాలను దీపాలతో అలంకరించడం, బాణసంచాలు కాల్చడం వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఆచారం క్రమంగా 'దీపావళి'గా రూపాంతరం చెందింది. అలాగే త్రిలోక కంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు, సత్యభామలతో కలసి హతమార్చిన సందర్భాన్ని కూడా ప్రజలు దీపావళిగా వేడుక చేసుకుంటారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సిక్కులు గురు గురు గోవింద్ సింగ్ 52 మంది బందీలను శత్రువుల నుంచి విడుదల చేయించిన ఘటనా స్మరణగా దీపావళి వేడుకలు నిర్వహిస్తారు.
Details
లక్ష్మీదేవిని పూజించాలి
దీపావళి సందర్భంలో లక్ష్మీదేవిని పూజించడం, ఆమె అనుగ్రహాన్ని పొందడం సంప్రదాయం. దీపావళికి ఒక రోజు ముందు లక్ష్మీదేవి పూజ చేసి సంపద, సుఖ శాంతుల కోసం భక్తిగా ప్రార్థిస్తారు. దేశంలోని కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో దీపావళిని కుటుంబ, సోదర సోదరీమణుల కలయిక దినోత్సవంగా జరుపుతారు. అంతేకాక, జైనులు మహావీరుని స్మరించుకుని దీపావళి సందర్భంలో భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొత్తం మీద, శ్రీరాముని ఘన విజయాలు, నరకాసురుని వధ, గురు గురు గోవింద్ సింగ్ సిక్కులను రక్షించడం, లక్ష్మీదేవి పూజ, మహావీరుని స్మరణ - ఇవన్నీ దేశవ్యాప్తంగా దీపావళిని పర్వదినంగా, ఉత్సవంగా జరుపుకునే కారణాలు.