Parenting: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు
ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళ చేతుల్లో ఫోన్ పెట్టేసి తమ పని తాము చేసుకుంటున్నారు. దీనివల్ల పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారుతున్నారు. స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే శారీరకంగా అనేక ఇబ్బందులు వస్తాయి. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. స్మార్ట్ ఫోన్ వల్ల వచ్చే సమస్యలను పిల్లలకు తెలియజేయండి: అతిగా స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను పిల్లలకు తెలిసేలా చెప్పండి. ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ని చూడటం వల్ల కళ్ళకు ఎలాంటి సమస్యలు వస్తాయో పిల్లల భాషలో తెలపండి.
ఇంటి పనుల్లో పిల్లలకు భాగస్వామ్యం ఇవ్వండి
ఆటలు ఆడండి: స్మార్ట్ ఫోన్ లో గేమ్ ఆడటం కన్నా బయటకు వెళ్లి మీ పిల్లలను ఆడించండి. దీనివల్ల మీ పిల్లల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కేవలం ఆటలు మాత్రమే కాదు కథలు చెప్పండి. ఇంకా మీ ఇంట్లో మీరు చేసే పనుల్లో మీ పిల్లల్ని భాగస్వాములను చేయండి. ఫోన్ వాడటానికి కొన్ని నిబంధనలు పెట్టండి: చదువుకునే సమయంలో, భోజనం చేసే సమయంలో, నిద్ర పోయే సమయంలో స్మార్ట్ ఫోన్ ని అస్సలు వాడకూడదని నిబంధన పెట్టండి. స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ మీ పిల్లలకు తెలియకుండా చూసుకోండి. ముందు మీరు స్మార్ట్ ఫోన్ అతిగా వాడకండి: తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మీరు స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించండి.