
Motivational: అనుకున్నది సాధించాలంటే.. ముప్పయ్యేళ్ల లోపు మీకున్న ఈ చెడు అలవాట్లు వదిలేయండి
ఈ వార్తాకథనం ఏంటి
జీవితంలో విజయవంతులు కావాలంటే ముందుగా మనం లక్ష్యాన్ని ఏర్పరిచి, దానిని సాధించేందుకు కృషి చేయాలి. పట్టుదలతో, సంకల్ప బలంతో ముందుకు సాగాలి. అయితే, విజేతలుగా నిలవాలంటే కొన్ని అలవాట్లను ముందే వదిలేయాలి. ముఖ్యంగా, 30 ఏళ్లు నిండే సమయంలో ఈ మార్పులు చేసుకుంటే, విజయ మార్గం సులభతరం అవుతుంది. 30 ఏళ్లలోపు వీటిని వదిలేస్తేనే మీరు విజేతలవుతారు మీరు త్వరలో 30 సంవత్సరాలు చేరుకుంటున్నట్లయితే, మీ జీవితంలో అభివృద్ధికి అడ్డుగా నిలిచే కొన్ని నెగటివ్ అలవాట్లను ఇప్పుడే వదిలేయాలి. ఇవి కొనసాగితే విజయాన్ని సాధించడమంటే కలే అవుతుంది. ఇప్పుడు ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం.
వివరాలు
1. పర్ఫెక్షనిస్ట్ కావాలనే కోరిక
కొంతమంది ప్రతి విషయంలో తప్పులేమి ఉండకూడదు అనే దృక్కోణం పెంచుకుంటారు. కానీ అలా పరిపూర్ణత కోసం నిరంతరం తాపత్రయపడితే, మనలో ఒత్తిడి, కలత పెరుగుతుంది. పని సరైన రీతిలో పూర్తవ్వాలనే దానిపై దృష్టి పెట్టడం ముఖ్యం. తప్పులు చేయడం ద్వారా నేర్చుకోవచ్చు. ప్రతి చిన్న విజయం మీద ఆనందపడటం ద్వారా ముందుకు వెళ్లవచ్చు. పరిపూర్ణత అవసరం కాదు - ప్రగతే ముఖ్యమైంది. 2. మల్టీ టాస్కింగ్ ఈ రోజుల్లో చాలా మంది మల్టీ టాస్కింగ్ చేయడం ద్వారా సమయం ఆదా అవుతుందని భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది మన పనితీరును దెబ్బతీయడమే కాక,మనస్సును అలసిపోతుంది. ఒకేసారి అనేక పనులు చేస్తే ఏ పని పూర్తిగా కాని అవకాశముంది.
వివరాలు
3. మిమ్మల్ని మీరు అనుమానించుకోవడం
బదులుగా,ఒక్కో పని పూర్తి చేసిన తర్వాత తదుపరి పని చేయడం ఉత్తమం. ఇది మీ ఉత్పాదకతను పెంచుతుంది,దృష్టిని మెరుగుపరుస్తుంది. ఏదైనా ప్రయత్నించే ముందు అది అవ్వదేమోననే భావన కలిగితే, మనలోని నమ్మకాన్ని నాశనం చేసుకుంటాం. నిజమైన ఎదుగుదలకు, ముందు మన సామర్థ్యాన్ని గుర్తించాలి. మీరు మీపై నమ్మకం పెంచుకోవాలి. కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. జెండా ఎగరేయాలంటే ముందు మొదటి అడుగు వేసే ధైర్యం ఉండాలి. 4. బాధిత మనస్తత్వం వద్దు ఏదైనా సమస్య ఎదురైన లేదా ఓటమి వచ్చినప్పుడు,దానికి వేరే వాళ్లను బాధ్యుల్ని చేయడం అనేది బాధిత మనస్తత్వం సూచన.ఇది మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లదు. బదులుగా,మన తప్పుల్ని ఒప్పుకుని,వాటినుంచి నేర్చుకొని,మళ్లీ అవి జరగకుండా చూసుకోవాలి.
వివరాలు
5.రిస్క్ తీసుకోవడానికి భయం
మన నిర్ణయాలకు మనమే బాధ్యత వహిస్తే, నెగెటివ్ ధోరణి తగ్గిపోతుంది. వైఫల్యం వస్తుందేమో అన్న భయం వల్ల చాలామంది తమకు నచ్చిన మార్గాల్ని అన్వేషించడానికి ముందుకు రారు. కానీ నిజంగా ఎదగాలంటే కొంత రిస్క్ తీసుకోవాల్సిందే. భయం వల్ల ముందుకు అడుగు వేయకపోతే, కొత్త అవకాశాలు కనిపించవు. రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటేనే మనలో దాగి ఉన్న శక్తిని వెలికితీయగలుగుతాం. విజేతలు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు. విజయాన్ని అందుకోవాలంటే కేవలం పని చేయడమే కాకుండా, మన మనస్తత్వాన్ని, అలవాట్లను సమీక్షించుకోవాలి. పై పేర్కొన్న అలవాట్లను త్వరగా వదిలేస్తే, మీరు మీ జీవితాన్ని విజయపథంలో నడిపించగలుగుతారు. ఇప్పుడే మొదలు పెట్టండి - విజేతగా మారండి!