
Motivation: సక్సెస్ రావాలంటే మొదట ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రాచీన భారతదేశ రాజకీయ చతురతకు చిరునామాగా నిలిచిన చాణక్యుడు, వ్యూహాత్మకంగా ప్రతి కదలికను ప్లాన్ చేస్తూ ప్రత్యర్థులను మట్టికరిపించే మేధావి. అతన్ని అవమానించిన నంద వంశాన్ని సర్వనాశనం చేసి, సామాన్యుడైన చంద్రగుప్తుడిని మగధాధిపతిగా మార్చిన ఘనత చాణక్యుడిదే. ప్రతికూలతల మధ్య కూడా బుద్ధి, వ్యూహంతో విజయాన్ని సాధించడమే ఆయన నీతిలోని మర్మం. ఆలోచనలో వైవిధ్యం ఉండాలి సాధారణంగా అందరూ ఆలోచించే విధానంతో కాకుండా, మీరు పరిశీలించే దృక్పథం, మాట్లాడే ధోరణి, వినే కోణం భిన్నంగా ఉండాలి. అనేక దశల్లో, ఇది విషయాలను కొత్త కోణంలో అర్థం చేసుకునే శక్తిని పెంపొందిస్తుంది. దీంతో సమస్యలపై లోతుగా ఆలోచించి సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి కలుగుతుంది.
Details
ఇతరుల సంతోషానికి బానిసకావొద్దు
మీ జీవితానికి నయమైన దిశ ఇవ్వాలంటే ముందుగా మీరు సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. ఇతరులను సంతోషపెట్టడం కోసం మీరు చేసే త్యాగాలు చివరికి మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. పైగా ఈ ప్రపంచం, ఇతరుల కోసం తలొంచే వ్యక్తిని పెద్దగా పట్టించుకోదు. అందుకే మొదటగా మీరు మీ కోసం జీవించండి. డబ్బు విలువను అర్థం చేసుకోండి డబ్బు ఉన్నప్పుడు దూరదృష్టి లేకుండా ఖర్చు చేసి, లేనప్పుడు బాధపడటం సరికాదు. ధనం సమాజంలో గౌరవానికి, స్వేచ్ఛకు ఆధారం. కాబట్టి డబ్బు ఉన్నా, లేనట్టు నటించడమో, లేకపోయినా ఉన్నట్టు కనిపించే విధంగా మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలి. మీరు చూపించే మాయ వల్ల ఇతరులకు నష్టం ఏమీ లేదు - పైగా మీ గౌరవం కాపాడబడుతుంది.
Details
విజయానికి తగిన దూరంలో ఉండండి
విజయాన్ని నిప్పుతో పోల్చవచ్చు. అతిగా దగ్గరవ్వడం దహింపజేస్తుంది, దూరంగా ఉండితే ఉపయోగపడదు. అందుకే విజయానికి అవసరమైన సమ దూరం పాటించాలి. అది మిమ్మల్ని గమ్యానికి నడిపించే సమతుల్యతను అందిస్తుంది గతాన్ని తవ్వుకోవడం బలహీనత చాణక్యుని మత్యే ప్రకారం, గతాన్ని గుర్తు చేసుకుని బాధపడటం బలహీనుల లక్షణం. గతంలో కోల్పోయినదాన్ని తలచి వేదనకు లోనవ్వకూడదు. అలాగని వాటిని పూర్తిగా విస్మరించమని కాదు - ఆ అనుభవాలను పాఠాలుగా తీసుకోవాలి కానీ అవి మిమ్మల్ని వెనక్కి లాగకుండా చూడాలి.
Details
వీరితో స్నేహం ప్రమాదకరం
చాణక్యుడు అంటాడు - నైతిక విలువలతో విరుద్ధంగా ఉన్నవారితో, అక్రమ మార్గాల్లో సంపాదించేవారితో స్నేహం చేయకూడదు. అలాంటి వ్యక్తులు మీ జీవితంలో తాత్కాలికంగా లాభం కలిగించినా, చివరికి చీకటిలో నెట్టే ప్రమాదం ఉంది. ఏదైనా పని ప్రారంభించే ముందు ఈ మూడు ప్రశ్నలు తప్పక అడగాలి 1. నేను చేయాలనుకుంటున్న పని ఏమిటి? 2. దీనివల్ల నాకు లభించే ప్రయోజనం ఏమిటి? 3. ఈ పని యొక్క నిజమైన విలువ ఏమిటి? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే, ఆ పని ఫలితాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు.
Details
కష్టాలను ఎదుర్కొనగల నైపుణ్యం
సమస్యలు వచ్చాయంటే వాటి నుంచి పారిపోవడం కాదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. మీరు కలిగిన బలహీనతలు, బాధలు ఎప్పటికీ బయటపడకుండా నియంత్రించుకోగలిగితే - మీరు నిజమైన బలవంతుడవుతారు. ప్రశంసల కోసం పని చేయొద్దు మీ పని మంచిగా చేస్తే ప్రశంసలు వస్తాయి. కానీ, ప్రత్యేకంగా అవే రావాలన్న కోరికతో పని చేయకూడదు. విజయం దానంతటదే వస్తుంది - అది మీ శ్రమను గుర్తించి ఫలితం ఇస్తుంది. అందుకే పని మీద శ్రద్ధ పెడితే, ఫలితాలు సహజంగా దక్కుతాయి.
Details
బలహీనులనూ పట్టించుకోండి
మీ ప్రత్యర్థి బలహీనుడని మీరు భావించవచ్చు. కానీ ఆ ధోరణి ప్రమాదకరం. బలహీన శత్రువు కాబట్టి అతను ఏమి చేయలేడు అని మానుకోకూడదు. వారు చాకచక్యంగా, సునాయాసంగా మిమ్మల్ని పడగొట్టే అవకాశం ఉంటుంది. అందుకే శత్రువులనూ దూరంగా కాకుండా, జాగ్రత్తగా సమీపంలో ఉంచాలి. ఈ విధంగా చాణక్యుని నైతిక, ధ్యానాత్మక దృక్పథాలు మన జీవితంలో అనుసరించదగిన మార్గదర్శకాలు. అవి వ్యక్తిత్వ వికాసానికి, విజయ సాధనకు బలమైన ఆధారాలు.