Page Loader
Honeymoon Destinations India: కొత్త జంటలు హనీమూన్‍కు వెళ్లేందుకు ఇండియాలో చాలా ప్లేస్‍లు ఉన్నాయి.. అవేంటంటే..? 
కొత్త జంటలు హనీమూన్‍కు వెళ్లేందుకు ఇండియాలో చాలా ప్లేస్‍లు ఉన్నాయి.. అవేంటంటే..?

Honeymoon Destinations India: కొత్త జంటలు హనీమూన్‍కు వెళ్లేందుకు ఇండియాలో చాలా ప్లేస్‍లు ఉన్నాయి.. అవేంటంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 22, 2024
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ శరవేగంగా కొనసాగుతుంది. పెళ్లి కాబోయే జంటలు, కొత్త జీవితం ప్రారంభించేందుకు హనీమూన్‌ను ఎక్కడ ఆరంభించాలో ఆలోచిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళితే బాగుంటుందనే సందేహంలో ఉన్న వారి కోసం భారత్‌లోని కొన్ని అద్భుతమైన హనీమూన్ డెస్టినేషన్లు ఇక్కడ ఉన్నాయి.

వివరాలు 

1. అండమాన్ నికోబార్ దీవులు 

అండమాన్ నికోబార్ దీవులు కొత్త పెళ్లయిన జంటల హనీమూన్‌కు ఒక అద్భుతమైన గమ్యం. ఈ దీవులు ఒక స్వర్గధామంలా అనిపిస్తాయి. విస్తారమైన బీచ్‌లు, శుద్ధమైన నీటితో ఇక్కడి వాతావరణం మంత్రముగింపుగా ఉంటుంది. షిప్పింగ్ క్రూయిజులు, వాటర్ స్పోర్ట్స్‌తో నిండి ఉండే ఈ ప్రాంతంలో జంటలు ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక్కడ ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో వాతావరణం మరింత మంత్రముగ్ధం చేస్తుంది. హనీమూన్‌కు అండమాన్ నికోబార్ దీవులు బెస్ట్ ఆప్షన్. హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతం సుమారు 1,682 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

వివరాలు 

2. సిమ్లా 

శీతల వాతావరణంతో ప్రసిద్ధి చెందిన సిమ్లా హనీమూన్‌కు ఒక రొమాంటిక్ డెస్టినేషన్. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఈ పర్వత ప్రాంతం జంటలకు మంత్రముగ్దమైన అనుభవాన్ని అందిస్తుంది. పచ్చని కొండలు, పురాతన శిల్పాలు, ఆహ్లాదకరమైన వాతావరణం సిమ్లాను ప్రత్యేకంగా చేస్తాయి. హైదరాబాద్ నుంచి సిమ్లా సుమారు 1,900 కిలోమీటర్ల దూరంలో ఉంది. శీతాకాలంలో ఈ ప్రాంతం మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

వివరాలు 

3. శ్రీనగర్ 

శ్రీనగర్ హనీమూన్‌కు వెళ్లేందుకు అత్యంత సరైన స్థలం. హిమాలయ పర్వతాల మధ్య, శీతల వాతావరణంలో ఉన్న ఈ ప్రాంతం జంటలకు ఎంతో మైమరిపించే అనుభవాన్ని ఇస్తుంది. దాల్ సరస్సులో చెక్క బోట్లపై విహారం, ప్రకృతితో అనుసంధానమైన అనుభవం కొద్ది రోజులు అలాగే ఉంటాయి. హైదరాబాద్ నుంచి శ్రీనగర్ దాదాపు 2,350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 4. గోవా గోవా హనీమూన్‌కు అనువైన ప్రదేశంగా మారింది. ఇక్కడి బీచ్‌లు, నైట్ లైఫ్, వాటర్ స్పోర్ట్స్, క్రూజ్ లు జంటలకు ఎంతో ఆనందాన్ని అందిస్తాయి. పాలోలేమ్, అంజున, బాగా, కలంగూట్ వంటి బీచ్‌లు ఎంతో ప్రత్యేకమైన అనుభవం ఇస్తాయి. హైదరాబాద్ నుంచి గోవా సుమారు 670 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

వివరాలు 

5. అలప్పీ 

కేరళలోని అలప్పీ ఒక స్వర్గంలా అనిపిస్తుంది. ప్రకృతితో నిండిన ఈ ప్రాంతం ప్రత్యేకమైన అనుభవాలను అందిస్తుంది. బ్యాక్‌వాటర్స్‌లో బీట్లలో ప్రయాణాలు, కేరళ వంటకాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. హైదరాబాద్ నుంచి అలప్పీ సుమారు 1,160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా: భారత్‌లోని ఇతర హనీమూన్ డెస్టినేషన్లలో డార్జిలింగ్, జైపూర్, ఊటీ, ముస్సోరీ కూడా చాలా ప్రాచుర్యం పొందాయి.