Valentine's Getaway: ప్రియమైన వ్యక్తితో ప్రేమకు చిహ్నాలుగా ఉన్న ఈ ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్ళండి
ఈ వార్తాకథనం ఏంటి
వాలెంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే రోజ్ డేతో తమ వేడుకలను ప్రారంభిస్తారు.
ఇక్కడ ప్రేమికులు అనగా కేవలం పెళ్లికాని యువతీయువకులు మాత్రమే కాదు, పెళ్లైన భార్యాభర్తలు కూడా ఒకరిపై ఒకరు తమ ప్రేమను సెలెబ్రేట్ చేసుకోవచ్చు.
మీ ప్రేమ జీవితంలో మీరు అనుభవించిన కొన్ని అపురూప క్షణాలు జీవితాంతం మీకు విలువైన తీపి గుర్తులుగా నిలిచి ఉంటాయి. మరి మీరు మీ ప్రేమను వేడుక చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా?
ఈ ప్రేమికుల వారంలో ప్రేమ జంటలు కలిసి విహరించడానికి భారతదేశంలో అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.
మీరు లాంగ్ డ్రైవ్‌లను ఇష్టపడేవారైతే అందమైన దృశ్యాలతో కూడిన రోడ్ వేలు ఉన్నాయి.
వివరాలు
Valentine's Day Week Getaways- ప్రేమికుల విహారయాత్రకు ఉల్లాసభరితమైన ప్రదేశాలు
మీ ప్రేమికుల రోజును మరింత ప్రత్యేకంగా మార్చడానికి మీరు మీ ప్రియమైన వ్యక్తితో విహారయాత్ర చేయాలనుకుంటే, ఈ గమ్యస్థానాలు మీకు బాగా సరిపోతాయి.
ఆగ్రా
ప్రేమకు ప్రతీకగా మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తాజ్ మహల్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ అద్భుత కట్టడము ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉంది. షాజహాన్,ముంతాజ్‌ల ప్రేమకథను తెలియజేసే ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. ప్రేమికుల రోజు సందర్బంగా, మీ ప్రియమైన వ్యక్తితో ఆగ్రా సందర్శించడం ఒక అద్భుతమైన అనుభవం అవుతుంది.
వివరాలు
శ్రీనగర్
శ్రీనగర్ పేరు చెప్పగానే మనకు చుట్టూ మంచుతో కప్పబడిన కొండలు, ప్రశాంతమైన నదులు కనిపిస్తాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించాలంటే, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ వెళ్లడం అవసరం. మీరు ఈ మాధుర్యాన్ని అనుభవించాలనుకుంటే, అది నిజంగా మిమ్మల్ని ఒక రొమాంటిక్ జానీ లో మునిగి పోయేలా చేస్తుంది.
అలెప్పి
మీరు మీ ప్రేయసి ప్రేమ మాయలో మునిగితేలాలంటే, కేరళలోని అలెప్పి గొప్ప ప్రదేశం. అలెప్పిలోని బ్యాక్ వాటర్స్‌లో హౌస్‌బోట్‌లో ప్రయాణిస్తూ, మీ భాగస్వామితో ప్రశాంతమైన వాతావరణంలో రొమాంటిక్ జ్ఞాపకాలను సృష్టించవచ్చు. ఈ ప్రదేశం మీరు ఆశించినంత సరికొత్త వాలెంటైన్స్ డే అనుభవాన్ని ఇచ్చేలా ఉంటుంది.
వివరాలు
ఊటీ
మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చెప్పుకోడానికి ఊటీ ఒక అనువైన ప్రదేశం. ఇది భారతదేశంలో ప్రసిద్ధ హనీమూన్ గమ్యస్థానాలలో ఒకటి.
ఉటీలో మీ ప్రేమ భాగస్వామితో కలిసి చల్లని వాతావరణాన్ని ఆస్వాదించడమే కాకుండా, టీ తోటలు, ఆకర్షణీయమైన ఆతిథ్యం కూడా మీకు మరొక ప్రపంచంలో విహరించే అనుభూతిని అందిస్తుంది.
తార్కర్లీ
మీ ప్రేమకు సముద్రం సాక్షిగా నిలవాలనుకుంటే, తార్కర్లీ బీచ్ ఉత్తమంగా ఉంటుంద. సముద్ర తీరం ప్రేమ జంటలకు గొప్ప రొమాంటిక్ స్పాట్. ఈ బీచ్ సందర్శించడం ద్వారా మీరు మరింత ప్రశాంతమైన వాతావరణం, మృదువైన ఇసుక తిన్నెలను, నీలిరంగు జలాలను ఆస్వాదించవచ్చు.