రాజస్థాన్‌లో ప్రకృతి సౌందర్యం.. వర్షాకాలంలో టాప్ టూరిజం ప్రాంతాలివే
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం రాజస్థాన్. ఇక్కడ వర్షాకాలంలో ప్రకృతి పులకరిస్తోంది.ఈ మేరకు రాజస్థాన్ లోని నేచర్ బ్యూటీ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో ప్రకృతి వర్షాకాలం లేదా శీతాకాలంలో మరింత శోభాయమానంగా కనిపిస్తుంటాయి.
వర్షాకాలంలో రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాలు ఆకుపచ్చగా ఉండి చూపరులను కనువిందు చేస్తుంటాయి. వీటిని చూసి ఆస్వాదించేందుకు ఏటా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
మౌంట్ అబూ : రాష్ట్రంలోని పర్యాటక స్థలాల్లో మౌంట్ అబూ హనీమూన్ డెస్టినేషన్‌గా గుర్తింపు పొందింది. ఎల్లప్పుడూ పచ్చదనంతో ఈ ప్రాంతం అలారుతుంది. అయితే వర్షాలు కురుస్తున్న సమయంలో ఈ ప్రదేశం మరింత అందంతో ఆకట్టుకుంటోంది.
DETAILS
దెయ్యాల కోటగా గుర్తింపు పొందిన భంగర్ కోట
భంగర్ కోట: చిన్న పర్వత శ్రేణి మధ్య భంగర్ కోట వర్షాలకు పచ్చదనంతో కనులవిందు చేస్తుంది. ఆకర్షణీయమైన గుర్తింపు పొందిన భంగర్ కోట దెయ్యాల కోటగా గుర్తింపు పొందింది.
ఉదయ్ పూర్ నగరం: చారిత్రాత్మక కట్టడాలను నింపుకున్న ఉదయపూర్ సిటీ, రాచరిక శైలికే కాకుండా పచ్చదనానికీ పేరు గడించింది. ఈ నగరంలో అనేక పర్వతాలు ఉన్నాయి. వర్షాకాలం, ఆ తర్వాతి కాలంలో వీటి అందం మరింతగా ఇనుమడించడం విశేషం.
జైపూర్ నగరం: రాజస్థాన్‌లోని మరో చూడదగ్గ ప్రదేశం జైపూర్ సిటీ. పింక్ సిటీగా ఘనత వహించిన జైపూర్‌లో అంబర్ ఫోర్ట్ సహా మరెన్నో చారిత్రాత్మక ప్రదేశాల అందాలకు నిలయంగా మారింది.