స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టూర్ ప్లాన్ చేస్తున్నారా? బెంగళూరు దగ్గర్లోని చూడాల్సిన ప్రదేశాలు ఇవే
స్వాతంత్ర దినోత్సవం దగ్గరలోనే ఉంది. ఈ సమయంలో ఆఫీసులకు వెళ్ళేవారికి లాంగ్ వీకెండ్ అవకాశం దొరుకుతోంది. కాబట్టి ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తే బాగుంటుందని ప్రతీ ఒక్కరికీ అనిపిస్తుంది. మీరు బెంగళూరులో ఉన్నట్లయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో చూడాల్సిన ప్రాంతాలు ఏమేం ఉన్నాయో తెలుసుకోండి. శివమొగ్గ: ఈ ప్రాంతంలో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. చుట్టూ పచ్చదనం, కొండలు దూకే జలపాతాలు, పచ్చని మైదానాలు, పురాతన దేవాలయాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. హస్సాన్: ఈ ప్రాంతాన్ని పేదవాడి ఊటీ అంటారు. బెంగళూరు నుండి 182కిలో మీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతంలో హసానాంబ దేవాలయం చాలా ఫేమస్.
పురాతన కట్టడాలు, దేవాలయాలు కనిపించే ప్రాంతం
ఉడుపి: తీరప్రాంతమైన ఉడుపిలో పశ్చిమ కనుకల అందాలు, వెజిటేరియన్ వెరైటీలు, అనేక దేవాలయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. బెంగళూరు నుండి 400కిలో మీటర్ల దూరంలోని ఈ ప్రాంతంలో 13వ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణ దేవాలయం బాగా ప్రాచుర్యం పొందింది. లేపాక్షి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఉండే లేపాక్షి, బెంగళూరు నుండి 120కి.మీ దూరంలో ఉంటుంది. విజయనగర చక్రవర్తి అయిన అలియా రామరాయ ఈ లేపాక్షి ప్రదేశాన్ని నిర్మించారు. ఇక్కడ పురాతన దేవాలయాలు, పురావస్తు కట్టడాలు కనిపిస్తాయి. దండేలి: రివర్ రాఫ్టింగ్ ఇష్టపడేవారు ఈ ప్రాంతాన్ని సందర్శించండి. బెంగళూరు నుండి 460కి.మీ దూరంలో ఉండే ఈ ప్రాంతంలో కాలి నది ప్రవహిస్తుంది. ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు.