Viral Video: ప్రకృతి అందాల నెలవు పాండవలంక జలపాతం వద్ద పర్యాటకుల సందడి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకృతి రమణీయత కలిగిన పాండవలంక జలపాతం పర్యటకులను కనువిందు చేస్తోంది. ఆ నీటిని సేవిస్తే సర్వ రోగాలు నయం అవుతాయని ఆ వాటర్ ఫాల్స్ కు క్యూ కడుతున్నారు పర్యాటకులు . కానీ ఈ అందాలను అనుభవించాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల పర్యాటకులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లా, శ్రీరాంపూర్ మండలం, వెన్నంపల్లి ప్రాంతంలోని పాండవలంక జలపాతం ఈ కాలంలో ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది. గుట్టలపై నుండి కురిసే వర్షపు నీరు జలపాతం అందాన్ని మరింత పెంచుతుంది, కాబట్టి ఇక్కడ పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు.
వివరాలు
టిని సేవించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని పర్యాటకుల నమ్మకం
ప్రతి శ్రావణమాసం వర్షాకాలం సమయంలో ఈ ప్రాంతంలో గుట్టపై నుండి నీరు రావడంతో పర్యాటకులు సమీప గ్రామాల నుండి కాకుండా, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడ చేరి జలపాతం వద్ద స్నానం చేయడమే కాకుండా, కిందికి వస్తున్న నీటిని బాటిల్స్ లో తీసుకెళ్తున్నారు. ఈ నీటిని సేవించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని పర్యాటకులు చెబుతున్నారు. పాండవలంక జలపాతం రామగిరి ఖిల్లా దగ్గర ఉంది.రామగిరి గుట్టపై చాలా ఆయుర్వేదిక మొక్కలు, వన మూలికలు సమృద్ధిగా ఉన్నాయి. ఆంజనేయుడు సంజీవని మొక్కను ఇక్కడి నుండి తీసుకెళ్లి లక్ష్మణుడికి ప్రాణం పోశాడని చరిత్ర చెబుతోంది.
వివరాలు
ప్రాథమిక వసతులు కల్పించాలని పర్యాటకుల డిమాండ్
కానీ, ఈ ప్రాంతానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం వలన పర్యాటకులు చాలా పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబితం జలపాతం కోసం ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించగా, పాండవలంక జలపాతం కోసం కూడా సమానమైన అభివృద్ధి, రోడ్డు సౌకర్యం, ప్రాథమిక వసతులు కల్పించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు.