వర్షాకాలంలో ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా? ఈ దేశాలు ట్రై చేయండి
ట్రావెల్ చేయడానికి చలికాలం, ఎండాకాలం మాత్రమే అనుకూలంగా ఉంటాయని అందరూ ఆయా కాలాల్లోనే పర్యటిస్తుంటారు. వర్షాకాలంలో పర్యటన అనే ఆలోచన కుడా ఎవ్వరికీ రాదు. అయితే మీకిది తెలుసా? వర్షాకాలంలో కూడా పర్యాటకంలో సరికొత్త అనుభూతిని పొందవచ్చు. అలాంటి అనుభూతిని అందించే దేశాలేంటో తెలుసుకుందాం. థాయ్ లాండ్: ఇక్కడ జులై నుండి అక్టోబర్ వరకు వర్షాకాలం ఉంటుంది. ఈ టైమ్ లో మీరు వెళ్తే అక్కడ కనిపించే పచ్చదనం మిమ్మలని పరవశించేలా చేస్తుంది. బ్యాంకాక్ లో ఐదు నిమిషాలకోసారి వర్షం పడుతూ, ఆ తర్వాత ఆగిపోతూ ఉంటుంది. వర్షాకాలంలో థాయ్ లాండ్ పర్యటనకు వెళ్తే, ఉత్తర, మధ్య థాయ్ లాండ్ ప్రాంతాలకు వెళ్ళడం మంచిది.
అగ్నిపర్వతాలు కనిపించే ప్రాంతం
స్పెయిన్: వర్షాకాంలో పర్యటించడానికి స్పెయిన్ ని మించిన దేశం లేదని చెప్పవచ్చు. ఇక్కడి సంస్కృతి, భోజనం, ప్రకృతి దృశ్యాలు మీకు అంతులేని ఆనందాన్ని అందిస్తాయి. ఇక్కడ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వర్షాకాలం ఉంటుంది. సింగపూర్: నవంబర్ నుండి జనవరి వరకు వర్షాకాలం ఉంటుంది. ఈ టైమ్ లో సింగపూర్ లో ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతుంది. రకరకాల ఆహారాలను రుచి చూడవచ్చు. అలాగే ఎత్తయిన జలపాతాలను చూడవచ్చు. కోస్టారికా: ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైనవి అగ్నిపర్వతాలు. తుఫాను తర్వాత స్పష్టంగా కనిపించే అగ్నిపర్వతాలను మీరు చూడవచ్చు. ఇంకా తాబేళ్ళు ఎక్కువగా కనిపించే టర్టిల్ ప్లేస్ ను చూడవచ్చు.