Hair care: గడ్డంలో చుండ్రును పోగొట్టే ఇంటి చిట్కాలు మీకోసమే
సాధారణంగా జుట్టులో చుండ్రు ఏర్పడడం సహజమే, కానీ మగవాళ్ళలో కొన్ని కొన్ని సార్లు గడ్డంలో కూడా చుండ్రు ఏర్పడుతుంది. ఈ కారణంగా గడ్డంలో దురద కలగడం వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుతం గడ్డంలో చుండ్రులును పోగొట్టే ఇంటి చిట్కాలు తెలుసుకుందాం. మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే గడ్డంలో చుండ్రును ఎలా పోగొట్టుకోవచ్చో ఇక్కడ చూద్దాం. కలబంద: ఆయుర్వేదంలో కలబందకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీని వల్ల అనేక చర్మ సమస్యలు, జుట్టు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కలబంద రసాన్ని వారంలో రెండు రోజులు గడ్డానికి మర్దన చేస్తే చుండ్రు తొలగిపోతుంది.
చుండ్రును తగ్గించే నిమ్మకాయ
కొబ్బరి నూనె: కొబ్బరి నూనె వల్ల మీ గడ్డం తేమగా, మృదువుగా తయారవుతుంది. ఒక వారంలో నాలుగు సార్లు కొబ్బరి నూనెను గడ్డానికి మర్దన చేసి 30నిమిషాల తర్వాత నీటితో కడిగితే సరిపోతుంది. బేకింగ్ సోడా: చాలా తక్కువ పరిమాణంలో బేకింగ్ సోడా తీసుకొని దానికి నిమ్మరసం లేదా యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి గడ్డానికి మర్దన చేయాలి. దీనివల్ల చుండ్రు తొలగిపోయి చిరాకు, దురద వంటి ఇబ్బందులు కలగవు. నిమ్మరసం: నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. కొద్దిగా నిమ్మరసాన్ని తీసుకొని గోరువెచ్చని నీటిలో కలిపి గడ్డానికి మర్దన చేస్తే గడ్డంలోని చుండ్రు తగ్గిపోతుంది.