
మీ కిచెన్ లోని వస్తువులే యాంటీబయటిక్స్ లాగా ఉపయోగపడతాయని మీకు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం వైరల్ ఫీవర్లు ఎక్కువైపోతున్నాయి. సాధారణంగా ఫీవర్ వచ్చిన వాళ్ళు యాంటీబయటిక్స్ తీసుకుని ఉపశమనం పొందుతారు.
యాంటీబయటిక్స్ వాడకం అధికమైతే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
మరి యాంటీబయటిక్స్ స్థానంలో ఏమైనా తీసుకోవచ్చా అనే ప్రశ్న మీలో కలిగితే, మీ కిచెన్ లోని కొన్ని వస్తువులు యాంటీబయటిక్ లాగా పని చేస్తాయని తెలుసుకోండి.
ప్రస్తుతం ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.
బొప్పాయి:
ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే మీరు అదృష్టవంతులే. మీకు సులభంగా దొరికే అవకాశం ఉంటే మీరు ఆరోగ్యవంతులే. బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
పెపైన్ అనే ఎంజైమ్ వల్ల జీర్ణసంబంధ సమస్యలు తగ్గుతాయి. శరీరానికి హాని చేసే పరాన్న జీవులను బయటకు పంపించి వేయడంలో బొప్పాయి ఉపయోగపడుతుంది.
Details
అల్లం
అల్లంని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇందులో ఉండే అనేక పోషకాలు శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి.
అల్లం తీసుకోవాలనుకునే వారు అల్లం చాయ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
గుమ్మడి విత్తనాలు:
గుమ్మడి విత్తనాలను రకరకాలుగా తినవచ్చు. కొందరు సలాడ్స్ లో తింటారు. మరి కొందరు పెరుగులో కలుపుకుని తింటారు.
ఇందులోని పోషకాలు శరీరానికి మంచి పోషణ అందిస్తాయి. శరీరానికి హాని చేసే సూక్ష్మజీవులను నశింపజేసే పోషకాలు గుమ్మడి విత్తనాల్లో ఉన్నాయి.
పసుపు:
భారతీయుల ప్రతీ కిచెన్ లో పసుపు కచ్చితంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా పసుపును కూరల్లో వేస్తారు. అలా కాకుండా పసుపు కలిపిన పాలు కూడా తాగవచ్చు.