
ఉగాది 2023: పండగ పర్వదినాన ప్రత్యేకంగా చేసుకోవాల్సిన వంటలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉగాది.. తెలుగువారికి చాలా ప్రత్యేకం. ఉగాది తోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాదిని యుగాది, సంవత్సరాది అని కూడా అంటారు.
ఉగాది రోజున స్పెషల్ గా ఎలాంటి రెసిపీస్ చేసుకుంటే బాగుంటుందో ఇక్కడ చూద్దాం.
బొబ్బట్లు:
శనగపప్పును ఉడకబెట్టి నీళ్లను వంపేయాలి. ఇప్పుడు కొద్దిగా సోంఫు గింజలు, ఇలాచీ గింజలు పప్పులో వేసి గ్రైండర్ లో రుబ్బాలి. ఆ తర్వాత చక్కెరను కూడా గ్రైండర్ లో వేసి రుబ్బి , దాన్ని పప్పుతో కలిపి పూర్ణం తయారు చేయాలి.
ఆ తర్వాత గోధుమ పిండి, నీళ్ళు కలిపి తడి పిండిముద్ద తయారు చేసి, చిన్న బంతుల్లాగా చేసి, ఆ బంతుల్లో పూర్ణం కలిపి చపాతీలాగా చేసి పెనం మీద కాల్చితే సరిపోతుంది.
రెసిపీస్
ఉగాది రోజున ఈజీగా చేయగలిగే స్పెషల్ రెసిపీస్
మామిడికాయ పులిహోర:
ముందుగా అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి, అందులో పల్లీలు, పచ్చి శనగపప్పు, మినప పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
ఇప్పుడు సన్నగా తురిమిన పచ్చి మామాడి కాయ తురుమును పాత్రలో వేయాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి మామిడి తురుము మగ్గే వరకు ఉంచి ఇంగువ వేయాలి. ఇప్పుడీ మొత్తాన్ని అన్నంలో కలిపేసుకుంటే పులిహోర రెడీ.
కొబ్బరి లడ్డు:
ఒక పాత్ర తీసుకుని అందులో తురుమిన బెల్లం, నీళ్ళను పోసి వేడి చేసి పాకంలా తయారు చేయాలి. తర్వాత కొబ్బరిని తురిమి నెయ్యిలో వేయించి, ఆ తర్వాత దానికి బెల్లం పాకాన్ని కలిపి కాసేపయ్యాక లడ్డూలు తయారు చేయడమే.