
Purnam Boorelu: ఉగాది స్పెషల్.. టేస్టీ టేస్టీ పూర్ణం బూరెలు.. ఈజీ రెసిపీ మీకోసం
ఈ వార్తాకథనం ఏంటి
పండుగలు, శుభకార్యాలైనప్పటికీ భోజన ప్రియుల దృష్టి బూరెల పైనే ఉంటుంది.
ఈ రోజుల్లో, చాలా మందికి పూర్ణం బూరెల తయారీ తెలియదు. కానీ ఒకప్పటి రోజుల్లో పండుగలు, ఫంక్షన్లు పూర్ణం బూరెలు లేకుండా పూర్తికావడం అసాధ్యం.
అందరికీ ఎంతో ఇష్టమైనవే అయినా, కొన్ని మంది వీటిని సరిగ్గా, రుచిగా చేయలేకపోతుంటారు. ఈ ఉగాది ప్రత్యేకంగా, టేస్టీ టేస్టీ పూర్ణం బూరెల తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
వివరాలు
తయారీకి అవసరమైన పదార్థాలు:
మినపప్పు - 1 కప్పు
బియ్యం - ¼ కప్పు
శనగపప్పు - 1 కప్పు
బెల్లం తురుము - 1 కప్పు
యాలకుల పొడి - కొద్దిగా
వంట సోడా - స్వల్పం
ఉప్పు - 1 టీ స్పూన్
నెయ్యి - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
నీరు - 2 కప్పులు
వివరాలు
తయారీ విధానం:
ముందుగా మినపప్పు,బియ్యాన్ని శుభ్రంగా కడిగి వేర్వేరుగా 5 గంటలు నానబెట్టాలి.అనంతరం మిక్సీలో వేసి నీరు ఎక్కువ కాకుండా కొంచెం గట్టిగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసిన పిండిని గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం సిద్ధం చేసుకోవాలి.
శనగపప్పును శుభ్రంగా కడిగి కొద్దిగా నీరు పోసి నానబెట్టాలి. ఒక గంట తర్వాత, కుక్కర్‌లో 5 విజిల్స్ వచ్చేలా ఉడికించాలి.
నీరు వడకట్టి, మెత్తగా మెదిపి, అందులో తగిన బెల్లం కలిపి, స్టౌపై తక్కువ మంటలో వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగి, మిశ్రమం ముద్దగా మారే వరకు కలుపుతూ ఉండాలి.
నీరు లేకుండా గట్టిపడే వరకూ ఉడికించాక, కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి కలిపి స్టౌ నుంచి దింపేయాలి.
వివరాలు
తయారీ విధానం:
మిశ్రమం చల్లారిన తర్వాత, కావలసిన సైజ్‌లో ఉండలుగా చేసుకోవాలి.
ఇప్పుడు మినపప్పు, బియ్యం పిండిలో కొద్దిగా వంట సోడా, ఉప్పు వేసి బాగా కలిపి సిద్ధం చేసుకోవాలి.
కడాయిలో నూనె వేడిచేసి, తయారైన పూర్ణం ఉండలను పిండిలో ముంచి నూనెలో వేసి, మధ్య మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి.
వేయించి టిష్యూ మీద తీసుకుని, పై నుంచి కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడిగా తింటే, అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు.