
Vitamin D : చలికాలంలో డి- విటమిన్ చాలా అవసరం.. ఎంతలా అంటే
ఈ వార్తాకథనం ఏంటి
మానవ శరీరానికి విటమిన్లు, పోషకాలు చాలా కీలకం. అయితే వీటిలో చాలా వరకు మనం తీసుకునే కూరగాయలు, మాంసం, పిండి పదర్థాల నుంచి అందుతాయి.
కానీ డి విటమిన్ మాత్రం ఆహార పదార్థాల్లో దొరకదు. ఇది సూర్యరశ్మిలో మాత్రమే ఉంటుంది. అందుకే దీన్ని 'సన్షైన్ విటమిన్' అంటుంటారు.
విటమిన్ డితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఇది శరీరానికి చాలా అవసరం కూడానూ.
ఉదయం పూట ఎండ నేరుగా చర్మంపై ప్రసరించినప్పుడు మీ ఎముకలు, మానసిక స్థితి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపడతాయి.
విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్. దీన్ని పొందడం శరీరానికి చాలా అవసరం.
details
చలికాలం కదా విటమిన్ డి తప్పనిసరిగా అవసరంే
చలికాలంలో పగలు చాలా తక్కువ సమయంగా ఉంటుంది కనుక శరీరానికి విటమిన్ డి తక్కువగా అందుతుంది.
ఇదే సమయంలో విటమిన్ డి శరీరంలో చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి ప్రతిరోజూ దీన్ని శరీరానికి అందించాల్సిన అవసరం లేదు.
మీకు రోజూ కుదరకపోతే విటమిన్ డి కోసం మీరు ప్రతి రెండు రోజులకు పదిహేను నిమిషాలు ఎండలో ఉంటే చాలు విటమిన్ డి మీ శరీరంలో ఓ హర్మోన్లాగా పని చేస్తుంది.
ఈ మేరకు ఓ పరిశోధన వెల్లడించింది. బరువు నిర్వహణలో, జీవక్రియ, అవయవాల పనితీరులో విటమిన్ డి గురించి పాత్ర చాలా ప్రత్యేకమైంది.
DETAILS
విటమిన్ డి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
విటమిన్ డి కారణంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడి దంతాలు, ఎముకలను బలంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలోనూ, సరైన బరువును కలిగి ఉండటంలోనూ సహకరిస్తుంది.
టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ నివారణలోనూ కీలక పాత్రే. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చిత్త వైకల్యం నివారణలో విటమిన్ డి పాత్ర అమోఘమని నిపుణులు అంటున్నారు.
పలు క్యాన్సర్లను సైతం నివారించే గుణం విటమిన్ డిలో ఉంటుందట. కండరాలకు సైతం శక్తిని, బలాన్ని చేకూరుస్తుంది.
DETAILS
విటమిన్ డి లోపం వల్ల కలిగే నష్టాలు ఇవే
మీ శరీరంలో విటమిన్ డి సరిపడ లేకపోతే మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇది పిల్లల్లో వేరుగా ఉంటుంది.
పిల్లల్లో, చిన్నారుల్లో విటమిన్ డి తక్కువగా ఉంటే వారి ఎదుగుదలను తగ్గిస్తుంది. దేహదారుడ్యం కుంటుపడటం, ఎముకలు పెళుసుగా మారడం లాంటివి సవాళ్లు విసురుతుంటాయి.
పెద్దవారిలో విటమిన్-డి తక్కువగా ఉంటే అలసట, కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ డి లోపం తీవ్రంగా మారితే ఎముకలు బలహీనంగా మారతాయి.
సూర్యకాంతి నుంచే కాకుండా తృణధాన్యాలు, పాలు, చేపలు, గుడ్లు ద్వారా విటమిన్ డి పొందవచ్చు. లేదంటే మీరు విటమిన్ డి సప్లిమెంట్లను కూడా స్వీకరించవచ్చు.
అయితే వీటిని తీసుకునేముందు కచ్చితంగా వెద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.