LOADING...
Motivational story: అత్యాశ పట్ల అప్రమత్తం కావాలి.. రాజును మోసగించిన దొంగ కథ ఇదే!
అత్యాశ పట్ల అప్రమత్తం కావాలి.. రాజును మోసగించిన దొంగ కథ ఇదే!

Motivational story: అత్యాశ పట్ల అప్రమత్తం కావాలి.. రాజును మోసగించిన దొంగ కథ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజు అనే వ్యక్తి స్వంత వ్యాపారాన్ని నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. ఒక రోజు, నగలను దొంగతనం చేసి పోలీసుల నుంచి పారిపోతున్న ఓ దొంగ ఒక్కసారిగా రాజు షాప్‌లోకి పరిగెత్తుకువస్తాడు. రాజు వెంటనే ఆ దొంగని చూసి, "ఎవరు నువ్వు? ఎందుకు ఇంత కంగారుపడుతున్నావ్? అసలు ఏం జరిగింది?" అని ప్రశ్నిస్తాడు. దానికి దొంగ సమాధానమిస్తూ, "నన్ను పోలీసులు వెంబడిస్తున్నారు. నేను కొంత నగలను దొంగతనం చేశాను. నువ్వే కాసేపు షాప్‌లో నన్ను దాచితే, ఈ నగల విలువ రూ.10 లక్షలు. వాటిని సగం సగం పంచుకుందామని ప్రలోభం పెడతాడు. రూ.5 లక్షలు వస్తాయని అనుకుని రాజులో ఒక్కసారిగా అత్యాశ పుడుతుంది.

Details

బయటపడిన రాజు నిజస్వరూపం

సరయినది కాదు అని తెలిసినా, డబ్బుపట్ల మోజుతో షాప్‌లోని ఒక మూలన దొంగని దాచేస్తాడు. తర్వాత కొద్ది సేపటికే అక్కడకు పోలీసులు చేరుకుని రాజును "ఓ వ్యక్తిని చూసావా?" అని ప్రశ్నిస్తారు. రాజు "నేను ఎవరినీ చూడలేదు. ఇంత వరకు ఎవరు రాలేదని అబద్ధం చెబుతాడు. పోలీసులు వెళ్లిపోయిన వెంటనే రాజు సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు దొంగ సగం నగలు ఇస్తాడని ఆనందిస్తుంటాడు. కానీ, కొంతసేపటికే దొంగ నిజస్వరూపం బయటపెడతాడు. రాజును బెదిరించడం మొదలుపెడతాడు.

Details

ప్రాణ భయంతో వణికిపోయిన రాజు

"నువ్వే నగల కోసం నన్ను కాపాడావ్. ఇప్పుడు నేను చెబితే డబ్బంతా ఇవ్వాలి. లేదంటే చంపేస్తా అని కత్తిని బయటకు తీయగానే, ప్రాణ భయంతో రాజుకు ఏం చేయాలో అర్థం కాకపోతుంది. అంతలోనే షాప్‌లో ఉన్న డబ్బంతా తీసేయాలని డిమాండ్ చేస్తాడు. భయంతో రాజు షాప్ గల్లా డబ్బంతా దొంగకే ఇచ్చేస్తాడు. తరువాత, డబ్బంతా చేతపట్టుకుని, ఆ దొంగ షాప్ నుంచి పరారవుతాడు. తాను మోసపోయినట్టు తెలిసిన రాజు గుక్కపెట్టి ఏడుస్తాడు. చివరికి ఏం చేయాలో అర్థం కాక, ఎవరకీ చెప్పకుండానే 'తేలు కుట్టినట్టు' మౌనంగా ఉండిపోతాడు.