
Vitamin P: విటమిన్ 'పీ' గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ పోషకపదార్థం సమృద్ధిగా లభించే ఆహారాలివే..!
ఈ వార్తాకథనం ఏంటి
విటమిన్ 'పీ' (ఇది బయోఫ్లవనాయిడ్స్ అనే పేరుతో కూడా ప్రసిద్ధి) శరీరంలో ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
ఇది విటమిన్ 'సి' ప్రభావాన్ని మెరుగుపరచడమే కాకుండా,రక్త నాళాలను బలంగా మార్చడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో ఇది ఎంతో దోహదపడుతుంది. నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి తో పాటు బయోఫ్లవనాయిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి.
ఈ పండ్లు తినడం వలన రక్తప్రసరణ మెరుగవుతుంది. అందువల్ల, రోజుకు కనీసం ఒక సిట్రస్ పండు తినడం మంచి అలవాటుగా మలుచుకోవాలి.
వివరాలు
రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి
బెల్ పెప్పర్స్ (ఎరుపు, పసుపు రంగుల్లో లభించేవీ) లో రుటిన్, క్వెర్సెటిన్ వంటి ఫ్లవనాయిడ్లు ఉంటాయి.
ఇవి కణాలకు శక్తిని అందించడంలో సహాయపడతాయి. మీరు ఇవి సలాడ్లు,కూరల్లో చేర్చడం ద్వారా శరీరానికి తగినంత విటమిన్ పీని పొందవచ్చు.
గ్రీన్ టీలో కాటెచిన్స్,ఫ్లవనాయిడ్స్ మంచి మొత్తంలో ఉంటాయి. ఇది చర్మానికి,గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
వృద్ధాప్య లక్షణాలను కూడా ఆలస్యం చేస్తుంది.రోజుకు 1 లేదా 2 కప్పుల గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, కోరిందకాయలు, బ్లాక్ బెర్రీలు వంటి పండ్లలో ఆంథోసైనిన్స్ అనే బయోఫ్లవనాయిడ్లు ఉంటాయి.
ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మీరు వీటిని స్మూతీలు, ఓట్స్ లేదా హెల్దీ స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.
వివరాలు
ఫిల్టర్ చేయని ద్రాక్ష రసంలో రెస్వెరాట్రాల్, బయోఫ్లవనాయిడ్స్
ఉల్లిపాయల్లో, ముఖ్యంగా ఎర్ర ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే శక్తివంతమైన బయోఫ్లవనాయిడ్ పుష్కలంగా లభిస్తుంది.
ఇది అలెర్జీల నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ సహాయపడుతుంది.
ఎర్ర ద్రాక్ష, ఫిల్టర్ చేయని ద్రాక్ష రసంలో రెస్వెరాట్రాల్, బయోఫ్లవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.
ఇవి నరాల పనితీరును మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.