యోగ నిద్ర: నిద్రకూ మెలకువకూ మధ్య స్థితిలోని యోగనిద్ర వల్ల కలిగే లాభాలు
యోగనిద్ర.. ఇదొక ధ్యానం అని చెప్పవచ్చు. నిద్రకూ మెలుకువకూ మధ్య స్థితిలో ఉండటాన్ని యోగనిద్ర అంటారు. ఉపనిషత్తుల ప్రకారం మహాభారతంలోని శ్రీకృష్ణుడు, యోగనిద్రను పాటించేవారట. యోగ నిద్ర కారణంగా మనసు ప్రశాంతంగా మారుతుంది. శరీరం నిర్మలంగా మారడమే కాకుండా ఎక్కడలేని నిశ్శబ్దం మీలోకి చేరుతుంది. అప్పుడు మీరు సుఖంగా ఉంటారు. యోగ నిద్ర గురించి సింపుల్ గా చెప్పాలంటే పూర్తిగా నిద్రపోకపోవడం. మెదడు మీ ఆదీనంలో ఉండడం, మీ శరీరం మీ ఆధీనంలో ఉండడం, అయినా మీరు నిద్రపోతుండడం. అలా అని నిద్ర నటించడం అస్సలు కాదు, అదొక స్థితి. ఈ యోగనిద్ర ధ్యానం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
యోగ నిద్ర వల్ల కలిగే ఆరోగ్య లాభాలు
జ్ఞాపకశక్తిని పెంచుతుంది: మెదడు మీద ఒత్తిడి ఎక్కువైనపుడు, లేదా అనేక ఆవేశాలతో మెదడు నిండిపోయినపుడు మెదడు సరిగ్గా పనిచేయదు. మెదడు మీదున్న బరువును తీసేయడానికి యోగనిద్ర బాగా పనిచేస్తుంది. అనవసర ఒత్తిళ్ళను దూరం చేసి, జ్ఞాపకశక్తిని పెంచడంలో యోగనిద్ర హెల్ప్ చేస్తుంది. నమ్మకాన్ని పెంచుతుంది: ఏదైనా పనిచేయాలంటే అది అవుతుందన్న నమ్మకం కావాలి. అలాంటప్పుడే పని మొదలు పెట్టగలం. ఆ నమ్మకాన్ని పొందాలంటే యోగనిద్ర ప్రాక్టీస్ చేయాలి. ఇన్సోమ్నియాను దూరం చేస్తుంది: నిద్ర పట్టక ఇబ్బంది పడేవారు నిద్రపోయే ముందు యోగనిద్రలోకి వెళ్తే ప్రశాంతమైన ఫీలింగ్ పొంది మంచి నిద్రను అనుభవిస్తారు. ఇంకా యాంగ్జాయిటీలను కూడా యోగనిద్ర దూరం చేస్తుంది. నెగెటివ్ ఆలోచనలను దూరం చేసి డిప్రెషన్ ను దగ్గరికి రానివ్వదు.