Dates: ఈ సమస్యలతో బాధపడేవారు ఖర్జూరానికి దూరంగా ఉండాలి..
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలంలో.. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ సమయంలో చలిగాలులు మరింతగా తీవ్రంగా ఉంటాయి.
చలిగాలులు, పొడి వాతావరణం వల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది.
చలికాలంలో ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వేగంగా వస్తాయి.
అందుకే ఈ సీజన్‌లో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం, ముఖ్యంగా ఆహార పరంగా. శీతాకాలంలో సరైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో కీలకమైనది.
ఇప్పుడు చాలా మంది డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా, ఖర్జూరాన్ని చలికాలంలో తినడం ఆరోగ్యానికి లాభకరమని నిపుణులు సూచిస్తున్నారు.
వివరాలు
చలికాలంలో ఖర్జూరం తీసుకోవడం వల్లన ఇమ్యూనిటీ
ఖర్జూరంలో ఉండే విటమిన్లు, పోషకాలు, ఫైబర్ మన శరీరానికి మేలు చేస్తాయి.
ఇవి ఎముకలను దృఢంగా మార్చి కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
అలాగే, చలికాలంలో ఖర్జూరం తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలసట, ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.
అయితే, ఖర్జూరాలు ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఖర్జూరాలను దూరంగా ఉంచడం మంచిది.
వివరాలు
డయాబెటిస్
టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఖర్జూరాలు సహాయపడవచ్చు. ఇది స్వీట్లకు మంచి ప్రత్యామ్నాయంగా ఉండవచ్చు, కానీ వీటిని పరిమిత సంఖ్యలో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, అలసట, బలహీనతలు రాగలవు.
అధిక బరువు
భారీ బరువు సమస్యలు ఉన్నవారికి ఖర్జూరాలు బరువు తగ్గడం కోసం అనుకూలం కాదని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరాల్లో అధిక కేలరీలు ఉంటాయి, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అధిక బరువు ఉన్నవారికి వేరే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం.
వివరాలు
అలెర్జీ సమస్యలు
ఖర్జూరాలలో ఉన్న సల్ఫైడ్‌లు అలెర్జీ కారణమవుతాయి. అలెర్జీతో బాధపడేవారు, ముఖ్యంగా చర్మ అలెర్జీ, శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ఖర్జూరాలను తినకపోవడం మంచిది. వీటిని తినడం వల్ల కళ్లలో దురద, చర్మం మీద దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు.
జీర్ణ సమస్యలు
కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారు ఖర్జూరాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తినడం వల్ల డయేరియా, విరేచనాలు కావచ్చు.
వివరాలు
వీళ్లు కూడా జాగ్రత్త..
జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్న పిల్లలకు ఖర్జూరాలు ఇవ్వకపోవడం మంచిది.
గర్బిణీ స్త్రీలు డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే ఖర్జూరాలు తీసుకోవాలి.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలను తినకూడదు, ఎందుకంటే ఇందులో అధిక పొటాషియం ఉంటుంది.
మలబద్ధక సమస్యలతో బాధపడేవారు ఖర్జూరాలు తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.
ఈ విధంగా, ఖర్జూరాలను తినే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.