
Mistakes: మీరు చేస్తున్న ఈ నాలుగు తప్పులే... విజయాన్ని దూరం చేస్తూ, ఓటమిని దగ్గర చేస్తున్నాయ్.. వాటిని ఇవాళే మార్చుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
విజయం అంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. అయితే, ఆ గమ్యాన్ని చేరక ముందే వెనక్కి తగ్గిపోతున్నవారి సంఖ్య ఎక్కువ.
ఎంత కష్టపడినా, ఆశించిన ఫలితాలు అందక బాధపడేవారు ముందుగా తమ చర్యలను స్వయంగా విశ్లేషించుకోవాలి.
తమ తీరును, అలవాట్లను, ఆలోచనలను ఒకసారి గమనించి చూసుకోవాలి.
నిజంగా తాము అన్ని విషయాల్లో సరిగ్గా చేస్తున్నామా? లేక అనుకోకుండా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయా? అనే ఆత్మపరిశీలన అవసరం.
ప్రతీసారి ఓటమిని ఎదుర్కొంటూ నిరాశ పడటం కన్నా, విజయానికి అడ్డుగా మారుతున్న కారణాలను తెలుసుకోవాలని ప్రయత్నించాలి.
వివరాలు
సాధారణంగా చేసే నాలుగు ప్రధాన తప్పులు
వివిధ అధ్యయనాలు చెబుతున్నట్లుగా, ఎంత కష్టపడ్డా కొంతమందికి విజయం ఎందుకు రాదంటే... వారు తెలియకుండానే కొన్నితప్పులు చేస్తుంటారు.
ఈ తప్పులను గుర్తించి మార్చుకుంటే, విజయం సాధించడం మరెంతకాలం పట్టదు.
దాదాపుగా చాలా మంది సాధారణంగా చేసే నాలుగు ప్రధాన తప్పులు ఉన్నాయి.
ఇవే మనల్ని గమ్యానికి దూరం చేసి, వైఫల్యానికి దగ్గర చేరుస్తున్నాయి. ఈ తప్పులు చేసేది ఆపేస్తే, విజయానికి నడిపే మార్గం సిద్ధమవుతుంది.
#1
స్పష్టమైన లక్ష్యం లేకపోవడం
విజయానికి ఇది మొదటి అడ్డంకి. మీరు ఎటు వెళ్లాలో, ఏం సాధించాలో ముందుగానే నిర్ణయించుకోకపోతే, ప్రయాణం దిక్కుతెలియని స్థితిలో ఉంటుంది.
ఒక స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని దానిపై దృష్టి కేంద్రీకరించండి. అలా చేయడం వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది.
అలాగే, ఆ లక్ష్యాన్ని చేరేందుకు ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇలా ముందే విధించిన దారిలో నడిచిన వారే విజేతలవుతారు.
#2
కష్టపడటంలో లోపించడం
ఏదైనా గొప్ప విజయాన్ని సాధించాలంటే కష్టపడక తప్పదు. శ్రమించకుండానే ఫలితం ఆశించడం అనవసరం.
కేవలం కలలు కన్నా చాలదు, వాటిని నెరవేర్చేందుకు పట్టుదలగా శ్రమించాలి.
మీరు చేసే ప్రతి పని పట్ల నిబద్ధత చూపాలి. పూర్తి నమ్మకంతో పని చేస్తే తప్పకుండా ఫలితాలు మీకు అనుకూలంగా మారతాయి.
#3
వర్తమానంపై దృష్టి పెట్టకపోవడం
భవిష్యత్తును ఊహించుకోవడం మంచిదే. కానీ దాని కోసం వర్తమానాన్ని విస్మరించడం ప్రమాదకరం. నేటి శ్రమే భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. అలాగే, గతం మీద ఎప్పుడూ ఆలోచించడాన్ని కూడా తగ్గించాలి. గతం నుండి పాఠాలు నేర్చుకోవాలి కానీ, మనం బ్రతికేది వర్తమానంలో. కాబట్టి ప్రస్తుత క్షణాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు సాగితేనే విజయాన్ని అందుకోగలుగుతాం.
#4
సమయాన్ని సద్వినియోగం చేయకపోవడం
సమయం అత్యంత విలువైన వనరు. ఇది పోతే తిరిగి పొందలేము. విజయవంతమైన వ్యక్తులు తమ సమయాన్ని ఎంతగా ప్రాముఖ్యతనిస్తారో గమనించాలి. ఒక మనిషి సమయాన్ని ఎలా వినియోగించుకుంటాడో, అతని విజయం అప్పుడు నిర్ణయించబడుతుంది. సమయాన్ని నిర్లక్ష్యం చేసినవారు జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. అందుకే, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ దాన్ని ఫలవంతంగా మలచుకోండి.
ఈ నాలుగు తప్పులు చాలామందిని విజయం దూరంగా ఉంచుతున్నాయి.
మీరు నిజంగా విజయం సాధించాలని అనుకుంటే... ఈ తప్పులను ఇకపై చేయకూడదు.
స్పష్టమైన లక్ష్యం, శ్రమ, వర్తమానంపై దృష్టి, సమయపాలన - ఇవే విజయానికి నూతన ద్వారాలు తెరచే నాలుగు మూలస్తంభాలు.