Women's Day 2025: మహిళామణులకు ఈ అందమైన కోట్స్‌తో శుభాకాంక్షలు చెప్పండిలా!
ఈ వార్తాకథనం ఏంటి
తల్లిగా ముద్దాడి, చెల్లిగా తోడుగా నిలిచి, భార్యగా సంరక్షణగా మారి, సేవకురాలిగా అహర్నిశలు శ్రమిస్తుంది... మహిళ!
ఈ మహోన్నతమైన మానవ మూర్తికి మనఃపూర్వక ధన్యవాదాలు చెప్పే సమయం ఇది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'ఆమె'కు శుభాకాంక్షలు తెలుపుదాం.
వీలైతే, ఒక చక్కని బహుమతితో ఆమెకు ఆనందాన్ని అందించండి.
ఆమె గొప్పతనాన్ని కొనియాడుతూ, మనసును హత్తుకునే ఈ సందేశాలతో మహిళామణులను సత్కరించండి.
వివరాలు
మహిళామణులకు శుభాకాంక్షల కోట్స్
కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి... పాదాభివందనం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
పురుషుల కంటే స్త్రీలు చాలా తెలివైన వారు. ఎందుకంటే తెలిసింది తక్కువైనా అర్థం చేసుకునేది ఎక్కువ. - జేమ్స్ స్టెఫెన్స్
అందానికి, రమ్యతకు చాలా తేడా ఉంది. నేను గుర్తిస్తే అందమైనది. కానీ ఆమె గుర్తిస్తే అది రమ్యమైనది. - జాన్ రస్కేన్
వివరాలు
మహిళామణులకు శుభాకాంక్షల కోట్స్
''యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా'' - స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
''కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేసు మాత.. ఇలా సమస్తం నీవే. ఓ మాతృ మూర్తి.. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ కిదే మా వందనం!!
''స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే ఈ సృష్టిలో ఏ జీవం ఉండదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు''.. కంటి పాపలా పిల్లలను కాపాడుకునే మాతృమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...