ప్రపంచ స్థూలకాయ దినోత్సవం: కొవ్వును కరిగించే కొన్ని ట్రీట్ మెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచమంతా ప్రస్తుతం ఒక మహమ్మారితో జీవిస్తోంది. అదే స్థూలకాయం. దీన్నెవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ స్థూలకాయం వల్ల అనేక ఇబ్బందులున్నాయి.
స్థూలకాయాన్ని నియంత్రించకపోతే బీపీ సమస్యలు, చక్కెర వ్యాధులు, గుండె సంబంధ సమస్యలు తలెత్తుతాయి.
వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ ప్రకారం, 2035వరకు ప్రపంచంలో సగానికి పైగా జనాభా స్థూలకాయంతో బాధపడతారని అంచనా. ఈ లెక్కన ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో ఆలోచించండి.
ఐతే స్థూలకాయాన్ని పోగొట్టుకోవడానికి కొన్ని ట్రీట్ మెంట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుని స్థూలకాయాన్ని జయించేసి అందమైన జీవితాన్ని గడపండి.
జీవనశైలిలోమార్పులు:
అస్తవ్యస్తమైన జీవన శైలి కారణంగా స్థూలకాయం వస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, అధిక కొవ్వు కలిగిన ఆహారాలను పక్కన పెట్టడం వల్ల స్థూలకాయాన్ని నివారించవచ్చు.
స్థూలకాయం
స్థూలకాయాన్ని తగ్గించే మరికొన్ని పద్దతులు
ప్రవర్తనలో మార్పులు:
మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే దాని ప్రభావం శరీరం మీద పడి లావుగా తయారవుతారు. అందుకే ఒత్తిళ్ళను పక్కన పెట్టండి. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటే మీలో కొత్త ఎనర్జీ పుట్టుకొచ్చి స్థూలకాయాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తారు.
సర్జరీ:
బేరియాట్రిక్ సర్జరీ ద్వారా స్థూలకాయాన్ని తగ్గించవచ్చు. ఈ సర్జరీలో పేగుల్లోని ఒక భాగాన్ని మార్చి, ఒక అవయవాన్ని కత్తిరించడం వల్ల ఇంతకుముందులా ఎక్కువ కేలరీలు తినకుండా ఉంటారు. దానివల్ల అటోమేటిక్ గా సన్నబడతారు.
తెల్లరక్తకణాలను బ్రౌన్ కణాలుగా మార్చడం:
తెల్లరక్తకణాలు కొవ్వును నిల్వ చేస్తాయి. అదే బ్రౌన్ కణాలు కొవ్వును కరిగిస్తాయి. ఇక్కడ తెల్లరక్త కణాలను బ్రౌన్ గా మార్చడం ద్వారా కొవ్వును కరిగిస్తారు. ఈ పద్దతి కొత్తగా వచ్చినట్లు సమాచారం.