ప్రపంచ పత్రికా స్వేఛ్ఛా దినోత్సవం 2023: చరిత్ర, ప్రాముఖ్యత, తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రతీ సంవత్సరం మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేఛ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటారు. పత్రికా స్వేఛ్ఛపై చర్చ జరగడానికి, అలాగే జర్నలిస్టులు ఎదుర్కునే ఇబ్బందులను ప్రపంచానికి తెలియజేయడానికి పత్రికా స్వేఛ్ఛా దినోత్సవాన్ని జరుపుతున్నారు. మొట్టమొదటిసారిగా 1993లో ప్రపంచ పత్రికా స్వేఛ్ఛా దినోత్సవాన్ని జరపాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. 1991లో జరిగిన యునెస్కో సమావేశంలో పత్రికా స్వేఛ్ఛా దినోత్సవం గురించి మొదటిసారిగా ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత రెండేళ్ళకు అమలులోకి వచ్చింది. నిజానికి ప్రపంచ పత్రికా స్వేఛ్ఛా దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఆఫ్రికా జర్నలిస్టులు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పత్రికా స్వేఛ్ఛ పాత్ర, జర్నలిస్టులకు ఉండే అపాయాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని వీరు భావించారు.
ప్రపంచ పత్రికా స్వేఛ్ఛ దినోత్సవం సందేశాలు
దాదాపు అన్ని దేశాలు ప్రపంచ పత్రికా స్వేఛ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటాయి. థీమ్ భవిష్యత్తులో హక్కులను రూపొందించడం: భావప్రకటనా స్వేఛ్ఛ ఆధారంగా మానవ హక్కులను సాధించుకోవడం అనే థీమ్ తో ఈ సంవత్సరం పత్రికా స్వేఛ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 30వార్షికాలు పూర్తి చేసుకుంది ప్రపంచ పత్రికా స్వేఛ్ఛా దినోత్సవం. సందేశాలు: పత్రికా స్వేఛ్ఛ అనేది అమూల్యమైన హక్కు. ఏ దేశం కూడా దీన్ని వదులుకోదు (మహాత్మా గాంధీ). పత్రికా స్వేఛ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది (నెల్సన్ మండేలా)