
World Sparrow Day: నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం.. అవి మన ఇంటికి వస్తే ఎంత మంచిదో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
పిచ్చుకలు ప్రస్తుతం అంతరించిపోతున్న జాతిగా మారాయి. వాటిని రక్షించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తారు.
ఒకప్పుడు పిచ్చుకలు ఇళ్ల ముందు, అటకలు, పైకప్పు సందుల్లో గూళ్లు కట్టుకుని ఉండేవి.
కానీ, ఆధునిక కాలంలో భవనాల పరిమాణం పెరగడం, చెట్ల సంఖ్య తగ్గిపోవడం, అలాగే ఎయిర్ కండిషనింగ్ వంటి సాంకేతికత ఇళ్లలో భాగమవ్వడం వల్ల పిచ్చుకలకు అనుకూలమైన వాతావరణం లేకుండా పోతుంది.
ఇంతకు ముందు 13 సంవత్సరాలు జీవించే సామర్థ్యం కలిగిన పిచ్చుకలు, ఇప్పుడు కేవలం 5 సంవత్సరాల లోపలే చనిపోతున్నాయి.
ఈ మార్పుకు మానవుల సాంకేతిక అభివృద్ధి ప్రధాన కారణమని స్పష్టంగా చెప్పొచ్చు.
వివరాలు
పిచ్చుకల దినోత్సవం ఆవిర్భావం
నగరాలలో గాలి ప్రసరణ లేని గట్టి నిర్మాణాల వల్ల పిచ్చుకలు నివాసం ఏర్పరచుకోలేకపోతున్నాయి.
అంతేకాక, గాజు కిటికీలను ఢీకొని పిచ్చుకలు మరణించే ప్రమాదం పెరిగిపోయింది. గ్రామాల్లో కూడా ఇళ్ల నిర్మాణం పూర్తిగా కాంక్రీటు ఆధారంగా మారిపోవడంతో, పిచ్చుకలకు సరైన వాసస్థలం దొరకడం కష్టమైపోయింది.
గణాంకాల ప్రకారం, కొన్ని సంవత్సరాలలోనే 60% కంటే ఎక్కువ పిచ్చుకల సంఖ్య తగ్గిపోయింది.
ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ పరిస్థితిని మార్చే దిశగా ఐక్యరాజ్యసమితి 2010లో మార్చి 20ను 'ప్రపంచ పిచ్చుకల దినోత్సవం'గా ప్రకటించింది.
వివరాలు
పెద్దల నమ్మకాలు
పెద్దల నమ్మకం ప్రకారం,పిచ్చుకలు ఇంటికి రావడం శుభసూచకం. పిచ్చుకలు నివసించే ఇళ్లలో పిల్లలు జన్మిస్తారని వారు విశ్వసించేవారు.
ఈ విధమైన నమ్మకాలు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడతాయి.
పిచ్చుకల సమక్షం వల్ల పరిసర వాతావరణం మాత్రమే కాదు, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
వివరాలు
పిచ్చుకలను మన ఇళ్ల దగ్గరకు ఎలా ఆకర్షించాలి?
పిచ్చుకల నివాసానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి - తోటలో పొదలు, చెట్లు పెంచాలి.
ఆహారం ఉంచాలి - బియ్యం పిండి, ధాన్యాలు వంటి చిన్న పిండి పదార్థాలను పెట్టండి.
నీరు అందించాలి - వాటికి తాగేందుకు శుద్ధమైన నీరు ఉంచాలి. తరచుగా నీటిని మారుస్తూ ఉండాలి, తద్వారా దోమలు వ్యాపించకుండా చూసుకోవచ్చు.
గూళ్లకు అనువైన ప్రదేశాలు కల్పించాలి - కార్డ్‌బోర్డ్ పెట్టెలో చిన్న రంధ్రం చేసి ఎత్తుగా వేలాడదీయండి. పిచ్చుకలను కాపాడడం మన బాధ్యత. అవి మన పర్యావరణానికి జీవితం అందించే సహజ భాగాలు. పిచ్చుకల సంఖ్య పెరగేందుకు మన అందరి సహకారం అవసరం!