
జిమ్ కి వెళ్ళకుండా కండలు పెరగాలంటే యోగా తో సాధ్యం
ఈ వార్తాకథనం ఏంటి
యోగా.. మన భారతదేశంలో ఎప్పటి నుండో అలవాటుగా ఉన్న వ్యాయామం. యోగా వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మన సొంతమవుతుంది. అంతేకాదు జిమ్ కి వెళ్ళకుండానే కండలు పెంచుకోవచ్చు.
కండలు పెరగడానికి మీ దగ్గర యోగా మ్యాట్ ఉంటే చాలు, కండలు పెంచే యోగాసనాలు మేము నేర్పిస్తాం.
ఎలాంటి ఆసనాల వల్ల కండలు పెరుగుతాయంటే,
త్రికోణాసనం:
కాళ్ళను ఎడంగా పెట్టి నిల్చొని కుడి పాదాన్ని బయటవైపు ఉంచేలా, ఎడమ పాదాన్ని లోపలి వైపు ఉంచుతూ కుడి చేతిని కుడి పాదానికి తాకేలా వంగాలి. ఇప్పుడు ఎడమ చేతిని ఆకాశంలోకి లేపాలి. నిమిషం తర్వాత ఇదే ప్రక్రియను ఎడమ వైపు చేయాలి.
యోగ
కండలు పెంచే యోగాసనాలు
వీరభద్రాసనం:
కాళ్ళు ఎడంగా చాపి నిల్చుని, కుడి మోకాలుని 90డిగ్రీల కోణంలో వంచి, ఎడమ కాలును వెనక్కి చాపాలి. ఇప్పుడు చేతులను గాల్లో లేపి నడుము పైభాగాన్ని వెనక్కి వంచాలి. దీనివల్ల ఛాతి, నడుము, కడుపు, తొడల భాగాల్లో కండరాల మీద బలం పడుతుంది.
బకాసనం:
గోడకుర్చీ వేసినట్లుగా కూర్చుని చేతులను కాళ్ళమధ్యలోకి తీసుకొచ్చి నేలమీద ఆనించి, నెమ్మదిగా శరీరాన్ని పైకి లేపడానికి ప్రయత్నించండి. ఛాతి, తొడభాగాలు ఒకదానికొకటి తాకినట్లుగా ఉండాలి. కొన్ని సెకన్లు చేసి రిలాక్స్ అవ్వండి.
నౌకాసనం:
మ్యాట్ మీద వెల్లకిలా పడుకుని చేతులను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాళ్ళను, నడుము పై భాగాన్ని 45డిగ్రీల కోణంలో పైకి లేపాలి. చేతులను ముందుకు చాచాలి.