
Diwali 2025: ఈ ప్రదేశాల్లో దీపావళి వేడుకలను ఒక్కసారైనా చూడాల్సిందే.. అవి ఎక్కడున్నాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో దీపావళి పండుగను ప్రతి ప్రదేశంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. దీపాలు వెలిగించడం, లక్ష్మీ దేవి, గణపతి పూజ, బాణాసంచాల వంటి ఆచారాలు దేశవ్యాప్తంగా సాధారణంగా ఉంటే, కొన్ని ప్రదేశాల్లో దీపావళి వేడుకలు అంత్యంత ప్రత్యేకమైనవి. ఈ అనుభూతిని జీవితంలో ఒక్కసారి చూడవలసిన ప్రదేశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
Details
అయోధ్య, ఉత్తరప్రదేశ్
రాముడి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన అయోధ్యలో దీపావళి వేడుకలు ఆకర్షణీయంగా ఉంటాయి. నగరంలోని వీధులు, రోడ్లు మట్టి దీపాలతో, లైట్లతో ప్రకాశిస్తాయి. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడిని స్వాగతించడానికి భారీ దీపాల ప్రదర్శనలు, దేవతల విగ్రహాలతో ఊరేగింపులు జరుగుతాయి. సరయు నది ఒడ్డున కూడా దీపాల అద్భుత దృశ్యాలను చూడవచ్చు. వారణాసి, ఉత్తరప్రదేశ్ వారణాసిలో దీపావళి రాత్రి దృశ్యాలు అంత్యంత అద్భుతంగా ఉంటాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలు వేడుకల్లో పాల్గొంటారు. రంగురంగుల బాణాసంచాల వేట వేడుకకు మరింత అందాన్ని చేకూరుస్తుంది. నది ఒడ్డున దీపాల ప్రతిబింబాలను చూసి మంత్రముగ్ధులవుతారు.
Details
జైపూర్, రాజస్థాన్
దీపావళి సమయంలో జైపూర్ నగర వీధులు, ఇళ్ళు, దుకాణాలను లైట్ల వెలుగుతో అలంకరిస్తారు. నగరంలో దీపావళి వేడుకలతో పాటు ప్రసిద్ధ స్వీట్లు, సాంప్రదాయ కార్యక్రమాలను కూడా ఆస్వాదించవచ్చు. ఉదయపూర్ 'సరస్సుల నగరం'గా ప్రసిద్ధి చెందిన ఉదయపూర్‌లో దీపావళి వేడుకలు అద్భుతంగా ఉంటాయి. సరస్సులపై వెలిగే దీపాలు, మెరిసే లాంతర్లు, రాజభవనాల వైభవం అందరినీ మంత్రముగ్ధులుగా చేస్తాయి. బాణాసంచాల ప్రదర్శనలతో ప్యాలెస్‌లు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. గోవా గోవాలో దీపావళి 'నరక చతుర్దశి'గా జరుపబడుతుంది. శ్రీకృష్ణుడు సత్యభామతో రాక్షసుడు నరకాసురుడిని విజయం సాధించిన దినాన్ని గుర్తు చేసుకుంటూ, నరకాసుర బొమ్మలను దహనం చేస్తారు. ఈ వేడుకల్లో సముద్రతీరపు సాంస్కృతిక అనుభూతిని కూడా ఆస్వాదించవచ్చు.
Details
అమృత్‌సర్
బంగారు నగరంగా ప్రసిద్ధి చెందిన అమృత్‌సర్‌లో దీపావళి వేడుకలు ప్రత్యేకత కలిగినవి. స్వర్ణ దేవాలయం, పవిత్ర సరోవర్ చుట్టూ వెలిగించే వేలాది దీపాలు, శుభప్రదమైన వాతావరణం మంత్రముగ్ధులను చేస్తుంది. సిక్కుల ఆరవ గురువు జీ స్మరణార్థంగా 'బంది చోర్ దివస్'గా దీపావళి జరుపుతారు. దిల్లీ దీపావళి సందర్శనకు ఉత్తమ నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటి. వీధులు, మార్కెట్లు ప్రకాశిస్తాయి. దీపావళి కార్నివాల్, షాపింగ్, సాంస్కృతిక కార్యక్రమాలతో ఇక్కడి పండుగ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ప్రదేశాల్లో దీపావళి వేడుకలు చూడడం ఓ అనుభూతి అని చెప్పొచ్చు. అద్భుతమైన దీపాల వెలుగు, సాంప్రదాయాల వైభవం, సాంస్కృతిక ప్రదర్శనలతో ఈ వేడుకలు మధురమైన జ్ఞాపకాలను అందిస్తాయి.