
llama 4 AI : వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో లామా 4 ఎంట్రీ.. మెటా నుంచి శక్తివంతమైన ఏఐ మోడల్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మెటా (Meta) సంస్థ నుంచి మరో భారీ అప్‌డేట్ వచ్చింది.
మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా, తాజాగా Llama 4 Scout, Llama 4 Maverick అనే రెండు కొత్త మోడల్స్‌ను అధికారికంగా విడుదల చేసింది.
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మెటా యాప్స్‌లో చాట్‌బాట్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఈ మోడల్స్ కీలక పాత్ర పోషించనున్నాయి.
ఇవి మెటా వెబ్‌సైట్, హగ్గింగ్ ఫేస్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా, మెటా మరో శక్తివంతమైన మోడల్ అయిన Llama 4 Behemothను ప్రివ్యూ చేసింది.
దీన్ని 'ప్రపంచంలో అత్యంత తెలివైన LLMలలో ఒకటి'గా మెటా పేర్కొంది. ఇదే మోడల్, ఇతర మోడల్స్‌కు 'టీచర్ మోడల్'గా పనిచేయనుందని వెల్లడించింది.
Details
మల్టీమోడల్ శిక్షణతో అద్భుత సామర్థ్యం
లామా 4 మోడల్స్‌కు మెటా విస్తృత శిక్షణను అందించింది. పెద్ద మొత్తంలో అన్‌లేబుల్డ్ టెక్స్ట్, ఇమేజ్, వీడియో డేటాతో ముందస్తు శిక్షణను ఇచ్చింది.
వీటి సామర్థ్యం టెక్స్ట్‌తో పాటు చిత్రాలను కూడా అర్థం చేసుకుని సమర్థవంతంగా స్పందించగలగడం. ఈ శిక్షణా విధానం చైనీస్ ఏఐ స్టార్ట్‌ప్ 'డీప్‌సీక్' ఆధారంగా రూపొందించారు.
దీని వల్ల మోడల్ వివిధ భాగాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఏర్పడింది. ఈ లామా మోడల్స్ తార్కికం మోడల్స్ కాదని మెటా స్పష్టం చేసింది.
ఉదాహరణకు ఓపెన్‌ఏఐ O3 మినీ, డీప్‌సీక్ R1 మాదిరిగా కాకుండా, ఇవి వేగంగా స్పందించేందుకు డిజైన్ చేశారు.
మానవ తరహా ఆలోచనను అనుకరించే మోడల్స్‌కు తేడాగా ఇవి తక్కువ సమయంలో ఉత్తమమైన ప్రతిస్పందనలందించగలవు.
Details
Maverick, Scout లక్షణాలు
Llama 4 Maverick
128 ఎక్స్‌పర్ట్స్
17 బిలియన్ క్రియాశీల పరామితులు
జనరల్ అసిస్టెంట్ & సృజనాత్మక రచన కోసం అనువైన మోడల్
ఖచ్చితమైన ఇమేజ్ అవగాహనతో ఫీచర్లను అందిస్తుంది
Llama 4 Scout
16 ఎక్స్‌పర్ట్స్ - 17 బిలియన్ క్రియాశీల పరామితులు
109 బిలియన్ యాక్టివ్ పారామితులు
కోడ్ బేస్ కాకుండా డాక్యుమెంట్ సంక్షిప్తీకరణ పనుల్లో రాణిస్తుంది
Gemma 3, Gemini 2.0 Flashlight, Mistral 3.1 వంటి బెన్చ్‌మార్కుల్లో మెరుగైన ఫలితాలు చూపించిందని మెటా పేర్కొంది
Details
ఎలా ఉపయోగించాలి?
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ వంటి మెటా యాప్స్‌లో ఇప్పటికే లామా 4 మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి.
అదేవిధంగా, మెటా ఏఐ వెబ్‌సైట్ ద్వారా 40కు పైగా దేశాల్లో వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.
అయితే, మల్టీమోడల్ ఫీచర్లు ప్రస్తుతం యూఎస్‌లోని ఇంగ్లీష్ వినియోగదారులకే పరిమితం. ఉదాహరణకు గిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేషన్ ఇంకా అందుబాటులో లేదు.